పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/231

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నా కవితానుభవములు

225

అంటూ పలవిస్తూ ఉండేవాణ్ణి. ఒక వేళ నేను ఎంత బీదవాణ్ణి అయినప్పటికి నేను మనిషి నే కాబట్టి నా భార్య నాకు లోబడి ఉండవలెననే కోరిక , నేను భర్తనుగదా అన్న అహంకారము ఉంటుంది లేండి. నీ వేమన్నా నాకు తాళిగట్టి మంత్రపూతంగా నన్ను పెండ్లి చేసుకొన్నావా?! అనేమాట ప్రత్యక్షంగా ముఖాముఖి యెత్తిపొడవడు. యిక్కాంత అహంభావ Ultra Modern wife తత్వం పట్టు పడనందువల్ల కొంచెం చాటుమాటుగా హావభావాలచేత నా మనస్సుకు తగి లేటట్లు స్ఫురింపచేస్తూ ఉంటుంది.

అయి తే మనలో మాట చెబుతున్నాను. నేనూ అంత నిరపరాధుణ్ణి కానులేండి “కంఠా శ్లేష ప్రణయినిజనేకింపునర్దారసంస్థే' అని భార్యా వియోగంవల్ల యక్షుడు దుఃఖంచినట్లు నేనూ దుఃఖంచి :

రసపిపాసలనడచు నీరమ్యమూర్తి
మెరుపువలెనైన గనుపించి మరగిపొమ్ము

అని చాల దీనంగా వేడుకొన్నాను. వేడేకొందీ యింక కొంత బిగిసి ఏదో కొంతకాలం కుదురుగా కాపురం చేశాము. సంతానంకూడా కలిగింది. కాలంగడిచి పోతున్నది. కాస్త యింటిపట్టున వుంటే బాగుంటుందని నాకోరిక. కాని నాకోరిక నిష్ప్రయోజనమైంది. కసితీర్చుకో దలచుకొని ' వెంకటచలం' గారి నవలలు, కథలు అన్నీ పట్టుపట్టి చదివాను, వ్యభిచరించడం ఒక గుణమని సిద్ధాంతం చేసుకొని, అందుట్లో మావివాహం Convenience Marriage కాబట్టి, అంత చచ్చు దనంగా ఉండడం మఱీ లోకువగా వుంటుందని అహంభావ