పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

224

కవికోకిల గ్రంథావళి


పిలిస్తే రాదు. వస్తే నిలవదు. తలవని తలంపుగా వస్తుంది సగములో ఏమో పుట్టిమునిగిపోయినట్లు వెడలిపోతుంది, ఒక్కొక్కప్పుడు అలక్ష్యంగా వచ్చిపోయిన జాడకు యా పరాగ రంజిత పదాంకాలే దుఃఖకరమైన సాక్ష్యంగా నిలిచి ఉంటవి.

"పొలతి రానూవచ్చె పోవనుం బోయె
 పచ్చిలత్తుక పూతఁ బైదలియడుగు
 ముద్రలు వాకిటి ముంగలం చనరె!
 సకియ మేలు మునుంగు సందడివినియు
 పవనకంపితపర్ణ కపమనుకొంటి
 ప్రేయసిచేతి దీపక కాంతిగాంచి
 యమల తారాశోభయని భాంతిపడితి
 ఎంతముగ్దుడనైతి - ఎంత పొరపడితి."

భాగ్యవంతుల యింటి బిడ్డను పెడ్లి చేసుకొన్న నిరుపేద సంసారికి ఏ అవస్థ కలుగుతుందో నాకూ అదే అవస్థ పట్టించినది. చూచారా, నాకూ ఆవిడకు ఎంత తారతమ్యముందో

“నీవురాణివె యౌదువు; నేను బిచ్చ
 మెత్తు పిచ్చిబికారినె; యిద్దఱకును
 దారతమ్యంబు కొండంత; తరుణి యింత
 పోల్చ లేనైతి; నినునమ్మి మోసపోతి. ”

"జలదపథంబునందిరుగు చక్కనిచుక్క వెయయ్యు నాపయిం
 గల ప్రణయంబునం బసిఁడిగద్దియడిగ్గి పొలానఁ బచ్చకం
 చెలకడఁ గూరుచుంటివి కృషివలబాలికయట్లు, గడ్డిపూఁ
 దలిరుల కాన్కతోఁ బ్రథమదర్శన ముత్సవమయ్యె దొయ్యలి."