పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా కవితానుభవములు

223

“ప్రత్యుషన్సుల నూత్నపత్రములువిచ్చి
 విమల హిమబిందువులురాల్చు సుమవితతుల
 తోడఁ బ్రమదాశ్రుపులు వీడిపాడుచుందుఁ,
 గలికి, నీమనంబంటెడు గానములను."

"నందెమబ్బుల చిఱువేరు చాయదీసి
 పండువెన్నెల పసరునఁ బదనుచేసి
 తరుణి, నీ పట్టుముసుగు నద్దకమువైవ
 విఫలయత్నంబులంజల్పి వెఱ్ఱినైతి."

"పారిజాతపుష్పంబులు పవనహతిని
 మృదులతృణములరాలెడు నెడల, నీదు
 చరణవిన్యాస కోమల శబ్దమనుచు
 నడుగుగుర్తులఁ బలుమాఱు నరయుచుందు."

నా మిత్రులు కొందరు నా కావ్యాలు కొంతవరకు ఆత్మచారిత్ర స్ఫోరకాలుగా ఉంటవని అంటున్నారు. పూర్వం నేను వ్రాసేటప్పుడు అజ్ఞాతంగా నాకాభావము ఉండినదో లేదో చెప్పలేనుగాని మిత్రుల వ్యాఖ్యానాలవల్ల యిప్పుడు నాకానమ్మకం కలుగుతున్నది. .

నాకు కవిత్వం యాదృచ్చికంగా లభ్యమైనది. అంటె Love at first sight అన్నమాట. " ప్రథమ కవితా సందర్శనానికి దారితీసినవి యీ క్రింది పరిస్థితులని స్ఫురిస్తున్నది.

"గూళులకువచ్చు పక్షుల కూజితములు
 సంజకెంజాయ గారడి చక్కదనము
 విరుల వినవచ్చు కీటకావ్యక్తగీతి
 కాపువానిని సైతము కవినొనర్పు.”

నా కవితావధువు సంపన్నుల యింటి ఆడపడుచు. అందువల్ల నా పెట్టుపోతల్లోను చెప్పుచేతల్లోను అణిగిమణిగి ఉండదు.