పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాహిత్యంలో వైచిత్రి

219


అనిచెప్పి, అంతటితో తనవి సనక “ఉద్ధతులమద్య పేదల కుండదరమె" అని లోకోక్తిప్రాయంగా నిలిచిపోయేటట్లు ఒక అర్ధాంతర న్యాసం విసరినాడు.

శ్రీనాథుడు "అస్తినాస్తి విచికిత్సా హేతు, శాతో దరిన్” అని యింకొక తీరున నడుమును వర్ణించినాడు. ఈవర్ణనములన్ని ఒకే విషయమును గురించి వెలసినప్పటికిని భిన్నత్వమువలన, నవ్యత్వమువలన, చమత్కారమువలన రసవంతములయి అనుభోగ్యములగుచున్నవి.

ఉన్నది ఉన్నట్లే చెప్పుట కవిత్వముగాదు. న్యూసు పేపరు రిపోర్టు కావచ్చును. కేవలము వార్తలను ప్రకటించడం కావచ్చును. లోకోత్తర వర్ణనానిపుణ కవికర్మ కావ్యమని మమ్మటుడు నిర్వచించినాడు. ఈ అభిప్రాయము లాక్షణికులందరు అంగీకరించినదే. లోకోత్తరత్వమనగా అనుభవసాక్షికమైన ఆహ్లాదగత చమత్కారమని పండితరాయలున్నూ, చమత్కారమనగా చిత్తవిస్తార రూపమగు విస్మయమని విశ్వనాధుడును వివరించినారు. ఇట్లనుటవలన చమత్కార రహితములగు కేవల శబ్దార్ధములకు కావ్య యోగ్యత సిద్దింపదు. కావుననె చేమకూర వెంకట కవి:

“ప్రతి పద్యమునందు జమ
 త్కృతి గలుగం జెప్పనేర్తు వెల్లెడ, బెళుకే
 కృతి వింటి మపారముగా
 క్షితిలో నీమార్గ మెవరికిన్ రాదుసుమీ”

అని రఘునాధరాయలు తన్ను నుతించినట్లు చెప్పుకొని యున్నాడు. ఇది ప్రగల్భముగా కనబడినప్పటికిని ఈ కవి