పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేటికవిత - ప్రకృతిపూజ

ప్రకృతిని అర్చించుటలోను ప్రకృతి సౌందర్యమును అభివర్ణించుటలోను, పూర్వకవులకును, నేటి కవులకును కొంత మార్గభేదము కనుపడుచున్నది. ప్రబంధకవులు కృత్రిమాలంకార ప్రియులు. నేటి కవులు సహజ సౌందర్య ప్రియులు. కాలానుసారముగ మానవసంఘము, దాని ఆచార వ్యవహారములు మార్పు చెందుట సహజము. సాంఘిక పరిణామము ననుసరించి దాని నాశ్రయించి బ్రతుకు కళలుకూడ మార్పు చెందుచుండును. భూత భవిష్యద్వర్తమాన కాలములకు అవినాభావ సంబంధము కలదు. కావుననే యొకటి లేక మరియొకటి యుండదు.

కవులు ఏకాలమునకు సంబంధించిన వారైనను, వారి రచనావిధానము మార్పు చెందినను, వారికి లోకమే ప్రమాణము. ప్రకృతి సౌందర్య వర్ణనము మానవ స్వభావ చిత్రణము వారికి ముఖ్యమైన విషయము. అందువల్ల నే కాబోలు ఒక ఆంగ్లేయ విమర్శకుడు 'Nature is the Godess of poets' - ‘కవులకు ప్రకృతి ఆరాధ్య దేవత' యని చెప్పినాడు.

పూర్వ కవిత్వములో అసంతృప్తి చెంది నవ్య కవిత్వము వ్రాయవలయునను కోర్కె ఈ నాటి కవులకు మాత్రమే సంబంధించినది కాదు. మన పూర్యులకును వారి కంటెపూర్యులున్నారు. వారికిని వారి పూర్వుల కవిత్వముపై కొంత అసంతృప్తికలిగి నవ్యకవిత్వము వ్రాయవలయునని