పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాహిత్యములో రమ్యత

205

ఖ్యునికి గోచరించదు. ఈ చిత్రముకూడ మన హృదయము చొచ్చుకొని వదలిపోదు. ఒక్కొక్క కావ్యము చదువుకొలదీ మన భావప్రపంచము వృద్ధి పొందుచుండును. సుందరమూర్తు లైన స్త్రీ, పురుషుల జనాభాకూడ విరివిచెందుతూ ఉండును. భూమిపైన స్వర్గము స్థాపించినట్లగును.

సర్ . సి. ఆర్, రెడ్డిగారు ఒక కావ్యమునకు వ్రాసిన ఉపోద్ఘాతమునందు “ప్రతిపద్యము చిత్తరువున కనుకూలించి సదిగా ఉన్నది” అని “కావ్యములో మనము చూడవలసిననది రామణీయకమే" నని వ్రాసియున్నారు. వారు కవియొక్క భావ చిత్రరచనా కౌశలమునకు ప్రాముఖ్య మొసగి యున్నారు. ఇట్టి నైపుణ్యము ప్రతి కవికిని వాని వాని సంస్కారపరిపాకము ననుసరించి నిర్మాణశీలమైన భావ బంధురత ననుసరించి కొద్దిగనో గొప్పగనో అలవడి యుండును.

కవి కావ్యమునందు సౌందర్యము సంపాదించుటకు హేతుభూతములైన వానిలో భావప్రకటనా విధానము ముఖ్య మైనది.

"A perfect expression is beauty. An imperfect expression is ugliness.”

“నిర్దుష్టమైన భావప్రకటనము సౌందర్యమనియు, దోషయుక్తమైన భావ ప్రకటనము అందవికారమనియు" ఒక ఆంగ్లేయ విమర్శకుడు చెప్పియున్నాడు. పార్ గ్రేవు మహాశయుడు తాను చేకూర్చిన పద్యసంపుటమునకు వ్రాసిన ఉపోద్ఘాతమునందు “ భావప్రకటనము తేటతెల్లముగ నుండ