పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/206

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

200

కవికోకిల గ్రంథావళి


ములవలె) హస్తమునందును (యెఱ్ఱతామరవలె)నాలుకకును ( నెత్తురువలె) పదతలమునందలి లత్తుక పూఁతకును నిర్ణయింపఁబడినది.

(2) శుక్ల వర్ణము:- దేవతల కన్నులకు (పాలవ లె) దంతములకు (ముత్యములు, పద్మబీజములు, తుషారము, మల్లెపువ్వులవలె) చక్రవర్తి పరిచ్ఛదమునకు, నిర్ణయింపఁ బడినది.

(3) నీలవర్ణము :- తారకలకు (ఆకాశమువలె) కేశములకు, (ఇంద్రనీలములు, భ్రమరములు, అంజనము. మయూరకంఠము, ఆకాశములవలె)

(4) కృష్ణవర్ణము:- తారకలకు నిర్ణయింపఁబడినది.

(5) జాబురాయి (పసుపు) వర్ణము - కరనఖర ప్రసాదనములకు నిర్ణయింపఁబడినది.

(6) సువర్ణము:- చక్రవర్తుల శరీరమునకు (జాంబూనద సువర్ణము, ప్రస్ఫుటిత పద్మబీజము, చంపకములవలె).

ఈ యారువర్ణములందు ఎఱుపు, తెలుపు, నీలము, సువర్ణములకె ప్రాధాన్య మొసఁగఁబడినది.

(రుధిరోద్గారి : వైశాఖము. )


___________