పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిత్రలక్షణము

199


యోగుల నేత్రములు ధనురాకృతిగలవి. సాధారుణుల కన్నులు ఉత్పల పత్రాకృతి నొందియుండును. భయమును క్రందనమును సూచించు కన్నులు [1]పద్మపత్రాకృతిగఁ జిత్రింపఁబడవలయును. యాతనాక్రోధవ్యంజకములగు నేత్రములు కపర్దాకృతిగ లిఖంపవలయును. దేవతల కన్నులు చక్కగఁ జిత్రింపఁబడిన యెడల రాజులకును బ్రజలకును మంగళము గలుగును. దేవతల నేత్రములు పాలవలె శుభ్రములుగ నుండును. స్నిగ్ధములైన నయన పల్లవములందు నేలాటి కర్కశత్వమును గోచరింపదు, నయనశోభ , పద్మపత్ర సదృశముగను, నింద్రనీలమణి మధ్యమునఁ దరళించు చంచల కాంతిపుంజమువలె నుండును. తారకలు నల్లవిగను బెద్దవిగను నుండవలయును.

కన్నులకువలెఁ గనుబొమ్మలకుఁ గూడఁ బ్రకార భేదములు వివరింపఁబడియున్నవి. ప్రశాంతవ్య క్తి యొక్క కనుబొమలు అర్ధచంద్రాకారముగ నుండును. క్రోధావిష్ణుని కనుబొమలు ధనురాకృతి గలిగియుండును. భీతునియొక్కయు విలపించు వానియొక్కయుఁ గనుబొమలు నాసికాసంధి యొద్ద నుండి ఫాలమునందు సగమువఱకు వ్యాపించియుండును.

వర్ణవిన్యాసమును గుఱించిన కొన్ని నియమములు క్రింద వివరింపఁబడుచున్నవి. .

(1) రక్తవర్ణము:- ఉత్పలాకృతి నయనముల యంచులకును, అధరోష్ఠములకును (బింబఫల సదృశముగ) గోళ్ళ కును, గోళ్ళ మధ్య ప్రదేశములందును (ఉత్పల నాగఫణ

  1. *ఇచ్చట పత్రముల యాకృతియె కేవలము గ్రాహ్యము