పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

198

కవికోకిల గ్రంథావళి

ఆదర్శ పురుషుల శరీరము మాంసలముగ నుండును; కాని, నరములు, కండలు,మున్నగునవి కానరావు. వక్షము సుపుష్టముగను, విశాలముగను, సమతలముగను జిత్రింపఁ బడును. చక్రవర్తులకును, లేక దేవమూర్తులకును కోర మీసము లుండవు. వారిని పోడశవర్ష యువకులనుగఁ జిత్రింప వలయును. వారి శరీరము సింహోదరమువలె పొడవుగను, విరివిగనుండును. ఈ సకల లక్షణములు టిబెట్ భారతీయ చిత్రములందు సామాన్యముగ గోచరించును.

చిత్రలక్షణ కారుఁడు నయనములను జిత్రించుటను గుఱించి యెంత విరివిగ నుపదేశించియున్నాఁడో, అంత యెక్కుడుగ మఱియే యంగమును గుఱించియుఁ జెప్పియుండ లేదు. ఏలనన నేత్రమె భావవ్యంజనమునకుఁ బ్రధాన సహాయకారి. గ్రంథకర్త యాకారభేదముల ననుసరించి క్రింది విధమున నైదు విధములైన కన్ను లను వర్ణించి యున్నాఁడు.

(1) ధనురాకృతి (2) ఉత్పల పత్రాకృతి (3}మత్స్యో దరాకృతి (4) పద్మపత్రాకృతి (5) *ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; పేరు లేని ref లలో తప్పనిసరిగా కంటెంటు ఉండాలికపర్దాకృతి. ఈ నయనాకృతుల పరిమాణములు నిర్ణయింపఁబడినవి. ధనురాకృతి గల నేత్రము నిమీలిత ప్రాయము, దాని విస్తృతి మూడు +ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; పేరు లేని ref లలో తప్పనిసరిగా కంటెంటు ఉండాలియవలప్రమాణము, ధనురాకృతి మొదలు క్రమముగ నొకదానికన్న నొకటి విరివియైనది. ధనురాకృతిక న్న నుత్పలాకృతి పెద్దది. అన్నిటికన్నను కపర్దాకృతి పెద్దది. అది బదియవల ప్రమాణముగలది. ధ్యానముద్రాకలితులైన


+