పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిత్రలక్షణము

195


బూర్వమె విగ్రహారాధనము అలవాటులో నుండినట్లు జాతక కథలు, లలితవిస్తారము మున్నగు బౌద్ధ గ్రంథములందుఁ బ్రమాణములు దొరకుచున్నవి. వైదిక మంత్రములందు ఋషులు వ్యక్తపఱచిన కవిత్వశ క్తినిఁజూడ వారి కల్పనా నైపుణ్యము అసామాన్యమని తెలియవచ్చుచున్నది. కాని వాస్తవ జగత్తునందు అట్టి కల్పనలను మూర్తీభవింపఁ జేయుటకు వారు ప్రయత్నింపరైరి. అయినను, యజ్ఞ వేదికా యూపస్తంభ నిర్మాణములందు దమ శిల్పకల్పనము, నేదో యొక రీతిగఁ గనఁబఱచిరి. చిత్రలక్షణకర్త వైదిక యజ్ఞములను గుఱించి చెప్పు సందర్భమునఁ జైత్యములను వర్ణించి యున్నాఁడు. వైదిక సాహిత్యమునందుఁ జైత్యశబ్దము చాల నరుదు. మనకు బౌద్ధ చైత్యములను గుఱించియె విశేషముగఁ దెలియును. అయినను వైదిక యజ్ఞవర్ణ నా సందర్భమున నొక విధమైన చైత్య చిత్ర లక్షణము, మహాభారతమునందలి యాదిపర్వము యొక్క తొంబదినాల్గవ యధ్యాయమున మనము చూడ వచ్చును.

చిత్రలక్షణముతీ యొక్క ద్వియాధ్యాయమునందు, దేవలోకమునఁ జిత్రవిద్య యుత్పత్తియైన విషయము వర్ణింపఁ బడినది. విశ్వసృష్టి యైన యనంతరము దేవతలు తమ మూర్తులను దామె చిత్రించుకొనిరి. ఈ విధముగఁ బూజయు బలి విధులును ఉత్పన్నములైనవి. ప్రథమాధ్యాయమునందు, మనుష్యుఁడు స్వాభావిక స్నేహప్రీతులకు వశివర్తియయి మనుష్య చిత్రముల రచియించుట కెట్లు ప్రవృత్తుఁడాయెనో, ఆ కథ వివరింపఁబడియున్నది. విశ్వకళ్యాణము కొఱకు ,