పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

194

కవికోకిల గ్రంథావళి


డని" యుఁ బేర్కొనఁబడియెను. “పథమమున వేదమును యజ్ఞమును ఆవిర్భవించినవి. చైత్యనిర్మాణ మొనరించుటకుఁ జిత్రవిద్య యావశ్యకము. అందుకొఱకు చిత్రవిద్య వేద స్వరూపముగఁ బరిగణింపఁబడినది. నేనె మొట్టమొదట మానవరూపమును లిఖంచితిని; నేనె మానవునికి మొట్ట మొదట నీ చిత్ర లేఖనవిద్య నేర్పించితిని.” అని బ్రహ్మ చెప్పెను. నగ్నజిత్తు అను శబ్దము చిత్రశిల్పి అను నర్థమున వ్యవహరింపఁబడినది. నగ్నజిత్తు విశ్వకర్మకు శిష్యుఁడు. నగ్నజిత్తు రచియించిన చిత్రలక్షణము ఆరవ శతాబ్దము నాఁటికె వ్యాప్తిచెంది యుండవలయును. ఏలనన వరాహ మిహిరుఁడు తన బృహత్సంహితయందు నగ్నజిత్తు శిల్ప మతమును రెండుచోట్ల నుదహరించెను.

చిత్రలక్షణ గ్రంథమున ముఖమండలము మూడు భాగములుగ విభాగింపఁబడి యున్నది. చిబుకము నాలు గంగుళులు; నాసిక నాలుగంగుళులు; నుదుకు నాలుగంగుళులు, ఇదిగాక చక్రవర్తులు ధరించుకొను ఉష్ణీషము అను కేశగుచ్ఛము నాలుగంగుళులు. చితలక్షణము సంపూర్ణముగ బ్రాహ్మణ్య గ్రంథము. మహాదేవుని పలుమాఱు నుతించుటవలన, ఆ గ్రంథమును సంకలించిన యతఁడు శైవుఁడని యనుమానింపవలసియున్నది. కాని గ్రంథ మధ్య భాగమందు బ్రహ్మకే ప్రాధాన్య మొసఁగబడి యున్నది. వైదిక యజ్ఞమందు విగ్రహములకు స్థానము లేదు. బ్రాహ్మణ్య ధర్మమునందు విగ్రహారాధన మెప్పుడు ఏ రీతిని ప్రవేశ పెట్టఁ బడినది తెలిసికొనుటకు వీలుపడదు. బౌద్ధమతవ్యాప్తికిఁ