పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

190

కవికోకిల గ్రంథావళి


కథలు వ్రాయువారందరు ఇట్టి బూతుకథలే వ్రాయుటలేదు. ఇట్టి కథలు ప్రచురించుటకు రెండు, మూడు మాసపత్రికలె కంకణము కట్టుకొన్నవి.

“సుబోధిని” పత్రికయందు “నవకవులు - బూతు కవనము” అని రామబ్రహ్మముగారు రచించిన వ్యాసము, “ప్రజామిత్ర" లోని వ్యాసమునకన్న మఱింత తీవ్రమై బూతుకథలతో వారికిగల పరిచయమును సార్థకపఱచు చున్నది. నవకవులెవ్వరును బూతుకవనము వ్రాయుటలేదు. వారి కవిత్వములోని శృంగారము సభ్యముగను నాజూకై న యభిరుచిగలదిగ నుండును. కవిత్వము వ్రాయువారి సంఖ్య చాల తక్కువ. వారి కథలలోగూడ బూతులేదు. అందులో ఒక్కరు మాత్రము అట్టి కథలను వ్రాయుచుందురు. ఇక మీదనైన రామబ్రహ్మముగారు విషయ పృథక్కరణము నందు కొంత పరిశ్రమ చేయుదురుగాక యనియు, అభినవ కావ్య సాహిత్య పరిచయము కలిగించుకొందురుగాక యనియు నా మనవి.


__________