పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/194

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

188

కవికోకిల గ్రంథావళి


ఈ కార్య మొనరింపడు. ఇక సరసుడైన దుష్యంతుని మాట వేఱ చెప్పవలయునా? ఈ సాదృశ్య ప్రభావము “మృదువు” అను విశేషణము అంతకు పూర్వము స్ఫురింప జేయలేని యెన్నో భావములు ఇప్పుడు దానికి సంక్రమించినవి.

కవి గాఢతరమైన తన రసానుభూతిని చెక్కు చెదరనీయక పఠితల హృదయముల స్ఫురింప జేయును. భావమునకు భాష కేవలము సంజ్ఞామాత్రమె, ఒక్కొక్కప్పుడు మనము భావించిన దొకటి, ప్రకటించిన దొకటిగా ఏర్పడును, ఏలయన, భావము సున్నితమైనది. భాష స్థూలమైనది. కావున దీనికొక Momentum కలదు. ఇందుకు ప్రతీకారముగ భావము తీవ్రతరము కానిదే భాష భావమునకు లొంగదు. కవి యుపయోగించు సంజ్ఞలు పఠితలకుగూడ తెలిసినవిగనో తెలిసికొన తగినవిగనో యుండవలయును. 'పదమునకు నిఘంటువు ప్రసాదించు అర్ధమునకంటె వేఱు శక్తులుకూడ కలవు. ఆ శక్తుల యన్నిటిపైనను కవి యాధారపడి తన భావమును స్పురింప జేయును. తన భావము ఇతరుల కెఱుకపడనియంత క్లిష్టసంజ్ఞలతో ప్రకటింపబడియున్న ఆ పద్యము మూగ చెవిటి వారల సంభాషణమువ లె వ్యర్థమగును. కావ్య ప్రయోజనమందు శూన్యమగుటవలన దానికి కావ్యత్య హానికూడ సిద్దించును. F. T. Palgrave గారు “Golden Treasury" అను ఖండకావ్య సంపుటమునకు తాను రచించిన యుపోద్ఘాతమున నిట్లు వ్రాసియున్నారు :