పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/190

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

184

కవికోకిల గ్రంథావళి


యెంకిపాటలు, కుందుర్తి నరసింహారావుగారి 'పంపాసరస్సు' (ఇదియొక ఖండకావ్యము), బొడ్డు బాపిరాజుగారి 'విపంచి' యేవాఙ్మయమునకై న అలంకార ప్రాయములుగ నుండగలవు మచ్చునకుగా కొందఱి కవులను, వారికావ్యములను పేర్కొంటిని చక్కగా కవిత్వము. వ్రాయగల కవులు ఇక నెందఱో నేడు ఆంధ్రదేశమున నున్నారు. ఈ రచనలన్ని యు చెత్తని చెప్పుటకు, రామబ్రహ్మముగారు సాహసింతురా ? అట్లు సాహసింతురేని వారి యభినవ కవితాపరిచయము 1916-న సంవత్సర పర్యంత మనియే మన మూహింపవలయును. అట్లు గానిచో వారి సహృదయత్వమును మనము శంకింపవలసి యుండును.

రామబ్రహ్మముగారు చూపించిన కావ్యదోషములు నేటి కవిత్వమున కానవచ్చుచున్నవి. దురాన్వయము, క్లిష్టాన్వయము, అర్థము బోధపడని పదములకూర్పు, నిరర్థక పదాడంబరత్వము, భావప్రకటనము చక్కగా చేయలేని గజిబిజితనము, మున్నగు కావ్యదోషములు ప్రత్యేకముగ ఆయాకవికి సంబంధించిన రచనాలోపములే కాని అవియెల్ల అభినవకవితకు లక్షణములు కావు. కవి మనస్సులోని భావము స్ఫుటముగా ప్రకటించుటకు తగినంత తీవ్రము కాకపోవుట చేతను, భాషపై కావలసినంత ప్రభుత్వము లేకపోవుట చేతను, భావోచితమైన పదమును వెదికికొన లేకపోవుట చేతను ఇట్టిదోషములు కలుగుచుండును. స్వాతంత్ర్యము చేకూరిన వెంటనే సంప్రదాయములమీది ప్రమాణగౌరవము నశించును. అట్లు నశింపనిదే సూత్న సృష్టిని పురికొల్పు