పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/19

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వ తత్త్వ నిరూపణము

13


గదా ప్రథానము, ఛందస్సుతో నేమిపని?” యని కొందఱు ప్రశ్నింపవచ్చును, అర్థము లేని శబ్దముల సంయోగ వియోగ భేదములవలన నుత్పత్తియగు రాగములు మనల నానంద పరవశులఁ గావించుచున్నవి. ఒక్కొక రసము నుప్పతిల్లఁ జేయుటకు నొకొక్క రాగ మనుకూలించు నని గానశాస్త్రవేత్తలు నిర్ణయించి యున్నారు. వీరణము (వీరంగము) వాయించి నపుడు కొందఱికి ఆవేశము వచ్చుటగలదు. యుద్ధపు బ్యాండు విన్నంతనే పిఱికివాని హృదయమునందైన రణోత్సాహము చిప్పిల్లును, ఇట్టి వికారములన్ని యు గేవలము శబ్దసంయోగ సారస్యమువలన హృదయమునఁ గలుగు మార్పు లేగదా! ఇఁక భావయుక్త పద్యములమాట వేఱుగఁ జెప్పవలయునా?

ఒక ఇంద్రియమునకంటె రెండింద్రియములకు సుఖము గూర్చు వస్తువు ననుభవించునపుడు మన యానందము ఇమ్మడించును, శిల్పముయొక్క. పరమప్రయోజనము “సద్యఃపర నిర్వృతి”ని గలిగించుటయెగాన నొ కేసమయమున నొకటి కన్న నెక్కు డింద్రియములకు •సుఖము గల్గించునదియె యుత్తమ శిల్పమని మనము నిర్ణయింప వచ్చును. [1]కావున ఛందోబద్ధమగు కావ్యము వచనముకంటె నెక్కుడు సుఖదాయక మనియె చెప్పవలయును.

సంస్కృత లాక్షణికుల కవిత్వ తత్త్వ నిర్వచనములు కొన్ని యెడలఁ బాక్షికములుగను అసంపూర్ణములుగ నున్నవి.

  1. There is something magical in rhythm. It even makes us believe that the sublime lies within our reach_Goethe.