పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అభినవాంధ్ర సాహిత్యము

183


మాత్రముననే అచ్చొత్తింపబడినవి యిప్పటికిని మనకు దొరకుచునే యున్నవి. ఈ కాలమున వ్రాయబడున దంతయు బ్రతికియుండునని యెవరు చెప్పగలరు? ఈసంశయము కాలమే. తీర్పగలదు. ప్రతిభావంతులగు కవులు ఏకాలమందైన నుందురు. అయి తే వారిమార్గములు భిన్నములుగ నుండవచ్చును.

పోలవరపు రామబ్రహ్మముగారు 'ప్రజామిత్రలో ఆధునిక కవిత్వమును విమర్శించిరి. వారి విమర్శలో కొంత సత్యమున్నది. కొంత తొందరపాటు, కొంత పొరపాటుకూడ ఉన్న ది. వీరికి వడ్డాది సుబ్బరాయుడుగారు మున్నగు పెద్ద కవులతో ఏలాటి తగాయిదా లేదు. రాయప్రోలు సుబ్బారావు, అబ్బూరి రామకృష్ణరావుగార్ల కావ్యములతో గూడ వీరికేలాటి యిబ్బందిలేదు. కాని యితర కవులు రచించిన కావ్యములన్నియు చెత్తలని వీరభిప్రాయపడిరి. సుబ్బారావు రామకృష్ణారావుగార్ల కావ్యములను మెచ్చుకోగలవారు తదితరులు వ్రాసినదంతయు చెత్తయని యెట్లుతలంచిరో నాకు బోధపడుట లేదు. వారి కావ్యములలో నున్న గుణములును దోషములును తక్కినవారి కావ్యములలోకూడ నున్నవి. పింగళి లక్ష్మీకాంతం వెంకటేశ్వరరావుగార్ల 'సౌందర నందనము, విశ్వనాథ సత్యనారాయణగారి 'ఆంధ్రప్రశస్తి' శివశంకరశాస్త్రిగారి 'హృదయేశ్వరీ, కృష్ణశాస్త్రిగారి గీతములు, వేదుల సత్యనారాయణ శాస్త్రిగారి ఖండకావ్యములు, జాషువాగారి 'ఫిర్దౌసి', నాయని సుబ్బారావుగారి మాతృ గీతములు, సుబ్బారావుగారి 'హంపీ క్షేత్రము', బసవరాజు అప్పారావుగారి గేయములు, నండూరి సుబ్బారావుగారి