పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/184

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అభినవాంధ్ర సాహిత్యము

[శ్రీ కొంపెల్ల జనార్దనరావుగారి సంపాదకత్వముస వెలువడుచుండిన “ఉదయిని" పత్రికలో ఈ వ్యాసము ప్రకటింపబడినది. -సం.]

సంషుమునందును వాఙ్మయమునందును మార్పులు అనివార్యములు. అన్యనాగరకతా సంసర్గమను బాహ్య నిమిత్తమువలన మార్పులు అలక్షితముగ తలసూపుచుండును. ఒక వాఙ్మయము యొక్క బాగోగులు, మంచి సెబ్బరలు తెలిసికొనవలయునన్న దానికన్న భిన్న సంప్రదాయము ననుసరించు మఱియొక వాఙ్మయముతో పరిచయము మనకుండవలయును. అద్వైతావస్థయందు తరతమజ్ఞానముండదు. మన దేశీయ వాఙ్మయములన్నియు ఏకసంప్రదాయ బద్దములయి సంస్కృత వాఙ్మయమునకు ప్రతిబింబములుగ నుండినవి.

ఆంగ్లేయుల సంబంధమువలన పాశ్చాత్యనాగరకతతో మనకు పరిచయము కలిగినది. వారి వాఙ్మయము, వారి ప్రకృతి విజ్ఞానము మనదృష్టి నాకర్షించినవి. వారి పరిపాలనా పద్ధతి మనయందు స్వాతంత్ర్యేచ్ఛ పురికొల్పి జాతీయైక్యమును పెంపొందించినది. సంఘమునం దవతరించిన ఈ నూతన స్వాతంత్ర్య ప్రియత్వము రాజకీయ విషయములందే కాక వివిధ సాంఘిక చర్యలయందును తలసూపినది, కట్టు బాట్లకు లోనయి బహిర్వ్యాప్తిని కోల్పోయిన సర్జనశక్తులు నేడు సంకుచితావరణమునుండి వెలి కురికి ఆత్నోచిత కార్యకల్పనకు సిద్ధములైనవి. వాఙ్మయము సాంఘికజీవనముయొక్క