పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

174

కవికోకిల గ్రంథావళి


లేని మాబోటివారము దుడ్డుకర్ర లెత్తుకొని బయలుదేరి నడుములు విరుగదన్తామనడము, అహంభావ కపులమని కంచు గంట మ్రోగించడము - ఇదీ ఒక నావల్టీగానే కనపడు చున్నది. వారి సిద్ధులను విమర్శింతుమేని మిగులునది అహంభావమే. తక్కినది అభావమే.

నవకవికి అనుకరణ అసహ్యమని వారన్నారు. అనుకరణము నిస్సారమని అందరు ఒప్పుకొనతగిన విషయము. కాని వీరికి మనదేశపు కవులను అనుసరించడము అనుకరించడము అసహ్యము. పరదేశ కవుల ననుకరించడము పరమార్ధము. ఈ వచన పద్యములు Walt Whitman పద్యముల కనుకరణము కాదని యెవరు చెప్పగలరు. -

ఛందస్సుల చండశాసనానికికూడా కాలం వెళ్లి పోయిందని శ్రీ శ్రీ గారు వ్రాసినారు. ఇది కేవలం భ్రాంతి. పది సంవత్సరములకు పూర్వము భావకవి అని అనిపించుకొనుట ఒక గౌరవము. నాడు భావకవులమని యనుకొన్న వారుకూడ నేడు. ఆపేరువహించుటకు సిగ్గుపడు చున్నారు. ఇప్పుడు ఆ నా వెల్టీ పోయినది. అంతే యీ నవకుల వచనపద్యా ల నా వెల్టీ కూడ, తెలుగుజాతి పరాయిది కానంతవరకు, తెలుగువారి హృదయమున రసజ్ఞత నశించనంతవరకు, తెలుగువారి సాంఘిక జీవన ప్రవాహమునకు గట్లుగా ఆంధ్ర మహా.భారతము భాగవతము రామాయణము జీవించి ఉండునంతవరకు తెలుగు కవిత్వమునకు ఛందస్సునకు విరహముకలుగదు. ఎన్ని రాజ్యములు పుట్టిచచ్చినవి? ఎందరు రాజులు గతించినారు? ఎన్ని నాగరకతలతో మనకు సంబంధము కలిగినది?