పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

కవికోకిల గ్రంథావళి


భావతీవ్రతయు గాంభీర్యమును ననుసరించి వాక్యమునందు మాటలు వెనుక ముందు ముందు వెనుక లయి యేదోయొక లయాధర్మమున కనుగుణముగఁ గుదురు పడుచుండును. “వచ్చెడువాడు ఫల్గుణుఁ డవశ్యము గెల్తుమనంగ రాదు” అను పద్యపాదమును “ఫల్గుణుఁడు వచ్చెడుఁవాడు” అని మార్చినయెడల మొదటివాక్యమునఁ బిక్కటిల్లు ఆతురతయు భావతీవ్రతయు రెండవవాక్యమునఁ సన్నగిల్లి చప్పిడియగును. ప్రకృతి యందు బీజరూపముగను అస్పష్టముగను, అసం పూర్ణముగను, సంకీర్ణముగ నున్న రామణీయకమును గేంద్రీ కరించి సహృదయుల భావమునందుఁ బరిపూర్ణముగస్ఫురింపఁ జేయుట శిల్పముయొక్క ప్రధాన ధర్మముగావున, కవిత్వ మునందు లయాస్వరూపము సర్వాంగసుందర మై పొడకట్టు చున్నది.

గద్యము పద్యముతోఁ గొంచె మించుమించుగఁ దుల తూఁగుచున్నను, ఛందోలోపము వలన రూపసౌందర్యమును కొంత గోల్పోవుచున్నది. గద్యము రసవంతముగను భావస్పో రకముగ నుండవచ్చును. కాని దానిని గద్య కావ్య మందుమే

గాని కవిత్వమనము. [1]కవిత్వమునంగల శ్రుతిరంజకత్వము గద్యమున నుండుటకు వీలు లేదు, “మనకు భావము, రసమే

  1. పూర్వము పద్యకావ్యములు చెవికి వినఁబడునటుల పెద్దగఁ జదువ బడుచుండెడివి. అందువలన కర్ణేంద్రియ ద్వారమునఁగూడ సుఖము నొందుచుండెడి వారము. కాని నేఁడు అలవాటు మాఱినది. చెవులు చేయవలసిన పని కన్నులు చేయుచున్నవి. పెదవులు కదలింపక నవలలు చదువ నలవాటు పడిన మనము పద్యకావ్యములనుగూడ నట్లే చదివి. పొందవలసినంత యానందమును బొందుటలేదు.