పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/174

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

168

కవికోకిల గ్రంథావళి

చిర యశః స్థాయిగొనిన ప్రాచీన సుకవి
వాఙ్మయమునను ఆకర్షవంతమయిన
రమ్యభావకలాపముల్, శ్రావ్యమైన
శబ్దరీతి విధానముల్ సంగ్రహింత్రు.

శీలమట్టుల నౌచితి చెదరనీక
అహివిధాన అశ్లీల మనాదరించి
ప్రేమమంత్ర మహోపాసనామయులగు
నవ్యుల కుపాదియయ్యె సౌందర్యమొకటె

ఈ రమ్యాలోకము సుబ్బారావుగారు ఉద్దేశించిన నవ్య కవుల Manifesto గా కనబడుచున్నది. శ్రీశ్రీగారు కూడ వారు ఉద్దేశించ కనకవుల పక్షమున మరొక Manifesto ప్రకటించినారు. ఇది 'ఫిడేలు రాగాలడజన్'కు Intro గా ఉన్నది. Intro అంటే Introduction; ఈ రాగాలడజన్ అనునది ఛందోబద్దముకాని పద్యముల సంపుటి. దీనిని రచించిన కవి మావాడె. Intro లో సారాంశ మేమనగా :

ఒక మాటకు ఒక అర్థం అదీ న్యాయం. కాని యీ ప్రపంచంలో చూడండి. ఒక మాటకు పది అర్ధాలు. ఒక అక్షరానికే లక్ష అర్ధాలు. ఇక రెండో కొసను ఒక అర్ధానికే కోటి పదాలు. ఈ అర్థాల నిరంకుశత్వం భరించలేడు నవకవి. వ్యాకరణం మాత్రం ? వాక్యానికి కర్త కర్మ క్రియలు విధిస్తారుకాదూ. వీటికి నవకవి విడాకులిస్తున్నాడు. కర్తలేకుండా ఒక క్రియమాత్రం నిరంకుశంగా విహరిస్తుంటే కొందరు కళ్లు పొడుచుకొంటున్నారు. కాని కవి సర్వతోముఖ స్వాతంత్ర్యదూత , స్వేచ్ఛాదాత. విభక్తి విశృంఖ