పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/173

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

తెలుగు కవితలో క్రొత్తతెన్నులు

167


నాడు. ఛందస్సు యదార్థమైన కవికి ఆటంకము కాదు. సహాయకరమె. హృదయములో నేమూలనో దాగియున్న భావములు ఉద్రిక్తములయి ఉత్తేజితములయి లయాశ క్తి మూలమున ఉత్పతన క్షమములు కాగలవు. 'A metrical garb has in all languages been appropria-ted to poetry. It is but the outward development of the music and hormony within. The verse far from being a restraint on the true poet, is the suitable index of his sense and is adopted by his free and delibarate choice' అని చఁదస్సునకు కవి మనసులోని లయాశబ్ద సారస్యములకును గల అవినా భావ సంబంధమును Newman గారు వచించినారు.

ఛందస్సు లేని పద్యము విన్నప్పుడు ఉప్పు లేని చప్పిడి కూరతో అన్నము తిన్నటులుండును. శ్రుతిరంజకత్వము అభావమగును. ఆనందదాయక హేతువులలో ఒకటి లుప్తమయి మన ఆనందము పరిపూర్ణముకాద., ఇంకను వీలైన యెడల ఆనందహేతువులను చేర్చుట న్యాయముగాని ఉన్న వానిని ఊడబెరుకుట సమంజసముకాదు. అపని చేయుటకు కవులే అవసరములేదు. ఏ అసమర్థుడు కూడ చేయవచ్చును.

రాయప్రోలు సుబ్బారావుగారు నవ్యకవులకు ప్రతినిధిగ రమ్యాలోకమను కావ్యనియమ గ్రంథమును రచించిరి. దానిలో

ప్రాతవైనంతనే త్యజింపరు: నవీన
మైనమాత్ర వరింపరు; ప్రియములై న
హృదయ సేవ్యమానము లైనవెల్ల స్వీక
రించి భావాంబరమలంకరింతు రర్థి

.