పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

166

కవికోకిల గ్రంథావళి

Walt Whitman రచించిన కొన్ని పద్యములు లయాన్వితమై ఛందోబద్ధ పద్యములకు దాదాపునకువచ్చుచున్నవి. హృదయములోని లయను మొదలంట యెవరు గోయగలరు? ఛందస్సునందు లయపుట్టును. లేక మనసులోని లయవలన ఛందస్సు పుట్టును. లయ కృత్రిమముగా కల్పించుకొన్న కవితోపకరణముగాదు. అది సహజము. కావుననే జగదేకము ప్రపంచములోని అన్ని జాతుల భాషలలోను అక్షరబద్ధము కాని అనాగరిక భాషలందును కవిత్వము ఛందోబద్ధముగానే ఉన్నది. ఈనియమము స్వాభావికము కానియెడల జగదేకత్వము సిద్ధింపదు

ఇప్పటి పదార్ధ విజ్ఞాన శాస్త్రజ్ఞులు కూడ Radiation, matter అనియు స్టూలముగా మన కంటికి కనబడు వస్తువులు కూడా bottled up radiations అనియు చెప్పుచున్నారు. ఈ radiation కాలావకాశ బద్దములైన తరంగములుగ ప్రసరించును. ఈ అలలు లయాబద్దములు. ఈ ప్రకృతియే లయా బద్దము లయసహజము. లయయొక్క శ్రుతిసుభగత్వమే ఛందస్సు,

కవితా విషయములందు మనలాక్షణికులకును యూరపియన్ విమర్శకులకును గమనింపదగిన భేదములు లేవు. Poetry is the rythmic creation of beauty అని ఆలన్ పో అన్నాడు. Musical thought అని కార్లయిలు చెప్పినాడు. There is something magical in rythm. It even makes us believe that the sublime lies within our reach అని జర్నను కవి గెతె లయా సౌందర్యముల సాహచర్యమును వివరించి .