పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/162

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

156

కవికోకిల గ్రంథావళి


ములు, అలంకారశాస్త్రములు వ్యాప్తిలోనికి వచ్చినతర్వాత కొందఱు కవులు కేవలము అలంకారముల వాడిరి. నీరసములైన వింత వింత యలంకారములు పుట్టినవి ఉపమయొక్క ప్రయోజనము విస్మృతమైనది. పిరుదులు ఇసుకతిప్పలైనవి. వక్షోజములు కొండలైనవి. కేవలము ఆకృతిని సూచించు ఉపమానము లధమములు, రాను రాను ఇట్టి వర్ణనములు కవితా సంప్రదాయము లైనవి.

అలంకారములు కుయుక్తులతో నిండిన మేదో వ్యాపారములు కావు. భావ ప్రకటనా వశ్యకతయే అలంకారములకు ప్రభవము. ఇవి కటగాంగదములవలె శరీర బాహ్యములైన భూషణములు కావు.


___________