పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

కవికోకిల గ్రంథావళి


నించుచుండును. యంత్రాగారములలోని పొగ, రస్తాలలోని దుమ్ము ఆ దేశపుఁ గవిత్వమును క్రమ్ముకొనినట్లుండును. ఆ కవితలందు కోకిలాలాపములు వినఁబడుటకు మాఱు శ్రవణ దారుణములైన రైలుబండి కూతలు వినఁబడుచున్నవి ! .

మన తెలుఁగు కవిత్వమున కీ గతి యెప్పటికిని బటకుండుఁగాక!

__________

3. కవిత్వ తత్త్వము

కవిత్వ తత్త్వమును గుఱించిన చర్చ లాక్షణికులు తలచూపినప్పటినుండియు జరుగుచున్నది. కవిత్వమన నేమి? అను ప్రశ్న అన్ని దేశములందును, అన్ని కాలములందును అడుగఁబడుచున్నది. కవులును, లాక్షణికులును, విమర్శకులును వారివారికిఁ దోఁచినరీతిని కవిత్వ లక్షణములను తత్త్వమును నిర్వచించిరి. నేఁడును ఆ ప్రశ్న యంతరింపలేదు. చాల తేలికగ నడుగఁబడి యసంపూర్ణముగఁ బ్రత్యుత్తరము పొందు ప్రశ్నలలో నిది యొకటిగ నున్నది.

ఛందోబద్దమగు పదసముదాయమె కవిత్వమని యభిప్రాయ పడువారును గొందఱు గలరు. కాని, యీ యూహ యవిచార మూలకమైనది. యదార్ధ కవిత్వమునకు ఛందస్సు అనివార్యముగ ననుగతమగును. అయినను ఛందమును కవిత్వ మనుసరింప వచ్చును, లేకపోవచ్చును. నిఘంటువులు, వైద్యశాస్త్రములు, వ్యాకరణములు మున్నగునవి ఛందోబద్దములై యున్నను వానియందు కవిత్వము పొడసూపకుండు