పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/156

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

150

కవికోకిల గ్రంథావళి


లివి:- ఆమె కన్నులు విశాలముగ నున్నవి. కనుగ్రుడ్డుకొనల నాజూకైన యెఱ్ఱరంగు కలదు. కన్నులలో జీవకాంతి తొలికాడు చున్నది. తెల్ల వెలుగు పొడచూపు చున్నది. మెత్తదనము ఆర్ద్రత్వము గలదు. ఈ భావములన్నియు కవి వర్ణింపవలయునన్న ఒక సీసపద్యము వ్రాయవలసి యుండును. ఈ భావములన్నియు స్ఫురింపజేయు ఒక్క పదము ఏ భాషలోను ఉండదు. కావున కవి తాను వర్ణింపదలచుకొన్న గుణములన్నియు అరవిందమున నున్నవని తెలిసికొని యుండుటచేతను అరవిందముయొక్క అనుభవజ్ఞానము సామాన్యముగావునను “అరవిందాలు గదోయి కన్నులు " అని సంక్షిప్త లేఖనమున (Short hand) లిఖంచినట్లు ముక్తసరిగి వర్ణించెను.

ఇట్టి సంకేతముల వలన భావముల యిమిడిక యు భాష పొదుపును సిద్ధించును. పసుపు ఎఱుపు నీలము అను మూడు రంగులే ప్రథానములు, చిత్రకారుడు ఈ మూడు రంగులను మిశ్రమము చేయుటవలన వేలకొలది. వర్ణచ్ఛాయలను సృజంచును. కవియునట్లే పరస్పర భిన్న వస్తువులలోని గుణములను మేళవించి నూత్న సృష్టిని చేయును,

కావ్య కళకు చిత్ర లేఖనమునకు దగ్గరి సంబంధముండినను వాహక భేదముల (Diference of medium) ననుసరించి వారి మార్గములు భిన్న ములు, చిత్రకారుడు ఉపమానోప మేయములను మేళవించి లిఖంచును. అనగా అరవిందములలోని వైశాల్యము నిగనిగ మొదలగు రమణీయగుణములను కన్ను లలో మూర్తీభవించునట్లు చిత్రించును. వేఱుగా అర