పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అలంకార తత్త్వము

147


భిన్నములని దానిని తీసివేసిన అసలు కవితా శరీరమె అదృశ్యమగును.

(భరతముని కాలమున “ఉపమా రూపకం చైవ దీపకం యమకం తథా, కావ్య స్యైతేహ్యలంకారాశ్చ త్వారః పరికీర్తితాః” అను ప్రమాణము ననుసరించి ఉపమ, రూపకము, దీపకము అను మూడు అర్ధాలంకారములును యమకమను శబ్దాలంకారమును గుర్తింపబడినవి. రుద్రటుని కాలమున “వాస్తవ మౌపమ్య మతిశయః శ్లేషః” అను నాలుగు అలంకారములు గుర్తింపబడినవి. తర్వాత ఉపమాలంకారము బహువికారములను పొందినది.

“ఉపమైకా శైలూషీ సంప్రాప్తా చిత్రభూమికా భేదాన్. వింజయతి కావ్యరంగే నృత్యంతీ తద్విధాంచేతః "

అలంకారములు పరిమితపదజాలముతో అపరిమిత భావచ్ఛాయలను ప్రకటించుట కేర్పడిన భావ ప్రకటన సాధనములు. వాని రమణీయతకు కారణము భావగాఢత్వము, శబలత్వము; తన్మూలమున రసత్వమును.) -

వాల్మీకి కాళిదాసాది మహాకవులు ఉపమాలంకారమునే విశేషముగ వాడిరి ' "ఉపమా కాళిదాసస్య" అను నానుడి లోకమున గలదు. ఉపమయె అన్ని యలంకారములకు మూలకందము. అలంకారములు కావ్యశరీరమునకు భూషణములను శాస్త్రీయ సాంప్రదాయానుసారముగ వచ్చు మాటలటుండనిచ్చి, భావ ప్రకటనమునకు సంబంధించినంత వఱకు అలంకార ప్రయోజనము నారయుదము. కవి చెప్పదలచుకొన్న భావము స్ఫుటముగ సూటిగ పఠిత హృదయ