పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/15

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వ తత్త్వ నిరూపణము

9


భూతమువలె మనమునందుఁ బొడకట్టును, చంద్రబింబము సుధాకర బింబముగాదు అందు అగాధములగు పల్లములు, ఎత్తైన కొండలు, అగ్నిపర్వతములు గలవు, చంద్రునిలోని మచ్చ కుందేలుగాదు, మఱ్ఱిచెట్టు గాదు; జింక కాదు. ఏకులు వడుకు అవ్వయుఁగాదు. అది అంతులేని చీఁకటి పల్లము ! మనమునందు ఈ భావము లుదయించుటతోడనే సుధాకర మండలము నావరించియున్న కవిత్వము నాశనమై పోయినది.

ఇట్లనుటవలన నింకమీఁద కవులు లోకములో పుట్టరా? నూతన కావ్యములు రచియింపఁబడవా, అని కొందఱు ప్రశ్నింపవచ్చును. కవులును బుట్టుదురు. నూత్న కావ్యములును రచియింపఁబడును. కాని, గుణమునందును గల్పన యందును వ్యత్యాస మగుపట్టును. ఇందుకుఁ జాల కారణములు గలవు. పరిస్థితులు మాఱినవి. ప్రజల విశ్వాసములు, భావములు, ఆదర్శములు మాఱినవి. బుద్ధికి బలము హెచ్చినది. భావమునకు బలము తగ్గినది. కవు లేకాలమునఁ బుట్టినను వారి మనఃస్థితి కవిత్వ రచనకుఁ దగినదియే యయ్యును, సమకాలీన భావములకును, నాగరకతకును, వశవర్తియై యుండును. వాల్మీకి మహాకవి యీ కాలముననే జన్మించి యుండియుండిన రామాయణమువంటి మహాకావ్వమును రచియింపఁజాలఁడనియే చెప్పవలయును. నాగరక దేశములలో నగ్రగణ్యమగు అమెరికా దేశమునందు నేఁడు రచియింపఁబడు కవిత్వమును జదివినయెడల ఈ రహస్యము కొంతవఱకు తెలిసికొనవచ్చును. ఆ కవిత్వమునందు మోటారుకారుల శబ్దము, ట్రాంబండ్ల గడగడలు ప్రతిధ్వ