పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అల్లసాని పెద్దన

133


జీవమణులు. ఈ చాకచక్యమునందు పెద్దన తిక్కనకు మాత్రమె రెండవవాఁడు,

నిర్జన ప్రదేశమందుఁ బ్రవరుని గాంచినపుడు వరూధినికి మొట్టమొదట కన్యా సహజమైన సిగ్గుపుట్టినది; పుట్టి, పూచిన పోఁకచెట్టు చాటునకు పోయినది ! ఇంక నే చెట్టు చాటునకు బోయినను ఆమె సౌందర్యము ప్రవరుని కగపడదు. కావుననే సిద్దహస్తుఁడగు కవి సందర్భానుసారముగఁ బోఁక చెట్టును దెచ్చి పెట్టినాఁడు..

“ఇంతలు కన్నులుండ" అను పద్వమునందు లోకోక్తియుఁ జమత్కారమును ధ్వనితముగఁ బ్రవరుని నేత్రసౌందర్యమును వర్ణింపఁబడినది. పద్యములోని మాటలు తేట తెలుంగైనను భావము గంభీరముగను బ్రౌఢముగ నున్నది.

పొంగిపొరలివచ్చు ప్రేమ ప్రవాహమును ఆపుకొన లేక వరూధిని ఆ ఛాందసుని "పాలిండ్లు పొంగారఁ బైయంచుల్ మోవఁగఁ” గౌగిలించుకొనినది. ఆ బ్రాహ్మణుఁడు ఓర మోమిడి హా శ్రీహరీ ! యనీ అంసద్వయమంటి పొమ్మని త్రోసిపుచ్చెను. వీలైనయెడల అంసద్వయమంటి యుండఁడు! సమయమునకుఁ జేతికఱ్ఱ మఱచివచ్చెను. పాప మా వనజగంథి మేని జవ్వాజిపసఁ! గందంబించు నొడలుగడిగికొని పాప పరిహారముగ సంధ్యవార్చినాఁడు. వరూధిని యొక్క యీ యస్త్రముకూడ నిరుపయోగమైనది. తన సౌందర్యము నిరాకరింపఁబడినందుకుఁ గోపమును. గోరికతీఱనందుల కసహనమును. స్త్రీజన సహజమైన అళీకనిందారోపణ నైపుణ్యమును, కొంచెము లేతపాకములోఁబడిన గయ్యాళితనమును,