పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

132

కవికోకిల గ్రంథావళి


కాంతలు తమ ప్రేమాతిశయము హావభావములచే సూచింతురు. పాపము! వరూధిని సైత మట్లె చేసినది కాని, ప్రవరుని మనస్సు ఒత్తిడిపడునది గాదు. ఆలసించిన యతఁడు మోరకించుకొని పోవచ్చునను అనుమానముచే ప్రేమను వచించినది.

వరూధిని ప్రవరునివలెకర్కశహృదయ గాదు. భావోద్రేకము కలది. పేశలమైన మనస్సు సౌందర్య పిపాస మిక్కుటము-ప్రవరుని సౌందర్యమున కచ్చెరువందినది-వర్ణించినది ఇంకను తనివి సనక యాతని ప్రేమించినది. వరూధినీ ప్రవరుల సందర్శనమును కవి అద్భుతముగ వర్ణించెను. వరూధిని “అబ్బుర పాటుతోడ నయనాంబుజముల్ వికసింప కాంతి పెల్లుబ్బి కనీనికల్ వికసితోత్పల పంక్తులఁ గుమ్మరింపఁగా, గుబ్బ మెఱుంగుఁ జన్గవ గగుర్పొడునన్” బ్రవరుని గాంచినది. మరియు “ఝళంఝళత్కటక సూచిత వేగపదార విందయై లేచి కుచంబులుం దుఱుము, లేనడు మల్లలనాడ నయ్వెడం బూచిన యొక్క పోఁక నునుబోదియ జేరి విలోకన ప్రభావీచికలం దదీయ పదవి కలశాంబుధి వెల్లి గొల్పి” నది. ఇంకను “మునుమున్ బుట్టెడు కొంకు లౌల్యము నిడన్ మోదంబువిస్తీర్ణతం, జొనుపం గోర్కులు కేళ్ళు ద్రిప్ప మదిమెచ్చుల్ ఱెప్పలల్లార్ప నత్యనుషంగస్థితి ఱిచ్చ పాటొసఁగ నొయ్యారంబునం జంద్రికల్ , దనుకం జూచి” నది. ఈపద్యములందుఁ బ్రతిక్షణ వ్యాప్తమైన కార్యసంచలనము జీవకళావిలసనము నిబిడీకృతమై యున్నది. ఇట్టి పద్యములు ఆంధ్రసారస్వత మకుటమునందుఁ బ్రకాశించు