పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అల్లసాని పెద్దన

131


పత్త్రికలలో ముద్రింపఁబడును. పత్రికాధిపతులు మంచి సెబ్బరలు పరిశీలించి ముద్రించుటకు వీలులేదు. అట్లయిన వారిపుటల నియమమునకు హాని గలుగును. ఇట్టి పరిస్థితులలో నిలుకడ నియమ మెట్లు కొనసాఁగును ? తన గ్రంథము తొందరగ బ్రకటిఁపఁబడవలయునను అక్కఱ పెద్దన కుండియుండదు.

Take time for thinking; never work in haste
And value not yourself for writing fast ;
A rapid poem with such fury writ;
Shows want of judgment not abounding wit

A hundred times consider what you have said ;
Polish. repolish, every colour lay,
And sometimes add, but often take away.

--John Dryden.

అను ఇటువంటి రచనా నియమమును పెద్దన చాల జాగరూకతతోఁ బాటించినట్లున్నది.

ద్రౌపది, కైకేయి, చిత్రాంగి మున్నగువారివంటి నాయికలు మన సారస్వతమునందు అరుదు. కొంచె మంచు మించు నాయికలందరు ముగ్ధులు. మౌగ్ధ్యము రమణీయముగ నుండవచ్చును; కన్యకలందరు ముగ్ధులుగ నుందురను ప్రకృతి నియమము లేదు. వరూధిని ప్రాగల్భ్యముగల కన్యక. తానే వలచినది. ఎట్టకేలకు ““నిక్కము దాపనేల ధరణీసురనందన యింక నీపయిం, జిక్కెమనంబు” అని తన భావమును బహిరంగముగ వెల్లడించెను. ఇట్లు చెప్పుట స్త్రీసహజమా?