పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/135

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అల్లసాని పెద్దన

129

యరిగె మహీనురాధముఁ డహంకృతితో నని రోషభీషణ,
స్పురణ వహించెనో యన నభోమణి దాల్చెఁ గపాయదీధితిన్!

ప్రవరుఁడు క్రూరుఁడు - మహీసురాధముఁడు - అహంకార యుతుఁడు శెబాష్ ! పెద్దనా, ముసుఁగులో దాఁగుకొని నీ అక్కసు వెళ్ళబుచ్చినావు ! కసిదీర్చుకొన్నావు ! ఈ సహానుభూతియె, యీ హృదయ వైశాల్యమె నిన్ను మహాకవి పట్టమునకు అర్హుని జేయుచున్నది.

వరూధిని ప్రశ్నలలో వాద నైపుణ్యము మెఱయు చున్నది; ప్రవరునివి చప్పిడిజవాబులు, 'యజ్ఞ కోటులం బావను లౌటకున్ ఫలము, మా కౌఁగిళ్ళ సుఖించుటేగదా! క్రతువు లొనరించుట స్వర్గభోగములకొఱకు, స్వర్గమునందు అవశ్యాను భోక్తవ్యమును ధర్మమును యోగ్యమునైన రంభాది భోగములు ఇచ్చట యేల నిషిద్ధములయ్యెను ? అశ్రమముగ సశరీర స్వర్గసుఖము సమకొనియుండ వ్రతోపవాసములఁ గృశుఁడవయి ఆత్మ నలఁచుట యెందుకు?' అని వరూధిని ప్రశ్నించుచున్నది.

పెద్దన కళానైపుణ్యమును గుఱించి యొకటి రెండు విషయములు సూచించి యీ వ్యాసము ముగించెదను. ఈ కవికిఁ బ్రకృతి రామణీయక ప్రీతి విశేషముగనున్నది. పద లాలిత్యము...... అందు ముఖ్యముగఁ దెలుఁగుమాటల తియ్యని పోకడలు ఈతనియొద్ద నేర్చుకొనవలయును. 'అల్లసానివాని యల్లిక జిగిబిగి' అను పూర్వ విమర్శకాభిప్రాయము నానుడియై యున్నది. పెద్దన కవిత్వము లలితముగఁ దీర్చి దిద్దఁబడి యున్నదనుటకు సందియము లేదు. “నిలుకడ