పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/133

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అల్లసాని పెద్దన

127


బడియుండెడిది. వరూధినిపైఁ గనికరము చూపెనని ఇప్పటికిని పెద్దనపైఁ గత్తినూఱు నీతిమంతులు గలరు !

“కలంచునే సతుల మాయల్ ధీర చిత్తంబుల౯” అని పెద్దన వ్రాసెను. మన యలంకారిక సంప్రదాయము ప్రకారము ఒకవేళ ప్రవరుఁడు ధీరుఁడైనఁ గావచ్చునేమొ కాని, పాపము ! వరూధిని మాయలాఁడి యెట్లయినది ! మాయలాఁడియయ్యును సతియయ్యెనేని దోషము లేదుగదా, తెలుఁగు కవులు సంస్కృత కవులవలె పదప్రయోజనము పాటించువారు కారనియు, పెద్దన 'సతి'ని కేవలము స్త్రీ పర్యాయపదముగ వాడెననియు సమాధానము చెప్పుకొన్నను వరూధిని పన్నిన మాయలేవి? ఆమె వలచినది ; వలచుట మాయలాఁడితన మైనయెడల ఆమెయు మాయలాఁడియె. పెద్దన గారాబపు తిట్లు తిట్టుచున్నాఁడు కాఁబోలు ! లేక మొగమాటపు తిట్లొ! -

వరూధిని క న్యక - అనన్యగృహీత - నిష్కల్మషమైన ప్రేమగలది ; మొట్టమొదట ఎవనిని బ్రేమించెనో అతినినే వివాహమాడినది. (గంధర్వుని మోసము తెలియదు గావున) ధనమార్జించుటకొఱకుఁ బ్రవరుని ప్రేమించుట లేదు. లేని | ప్రేమ నటించుట లేదు. జారిణికి ఇంతటి గాఢానురాగ మెక్కడిది? “ఇంద్రునిభాస్యవాఁ డనఁగ నింద్రుఁడొ చంద్రుఁడొ యా యుపేంద్రుఁడో" అని చెలికత్తెలు అతనిపై లాఘవము పుట్టించుటకు యత్నించినను “పూఁతపసిండివంటి వలపుంబచరించుకులంబునీతికిన్ , లేఁతగదమ్మ" అని దుర్నీతులు బోధించినను చెవినిబెట్టక ప్రవరునే వరించినది. ఆమె