పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అల్లసాని పెద్దన

125


ణత్వమె ధీరత్వమైన యెడలఁ బ్రతిమంటప స్తంభమును ధీరుఁడే!

నిరుపమాన సౌందర్యవతులైన కామినులయెదుట లోకమే యెఱుఁగని ఋశ్యశృంగునివంటి ఆజన్మ మునీశ్వరులును. అపారసంకల్పశక్తిసంపన్నులైన విశ్వామిత్రులవంటి యోగీశ్వరులును చలించిరి. ఇంతయేల? “బమ్మ కై నఁబుట్టు రిమ్మ తెవులు" ఇట్లు చిత్రించిన వారు మానవ స్వభావము యొక్క లోతుపాతుల నెఱింగిన మహాకవులు. నీతి శాస్త్రమునకు వెఱచి శిల్పమును ద్యజించినవారు గారు. ఆ కాలమునందు ఆర్యసంఘ మింతటి యాచారబద్దముకాదు కాఁబోలు!

ప్రవరుఁడెట్లు చిత్రంపఁబడియుండినఁ బ్రాణవంతుడుగ నుండెడివాఁడు ! ఆయన యింతముం దెన్నఁడును వరూధినివంటి యందకత్తెను జూచియెఱుఁగడు; చూచినప్పుడు ఆశ్చర్యపడి యుండవచ్చును. అనంతరము మానవప్రకృతికి సహజమగు కోరిక పుట్టియుండవచ్చును. మఱుక్షణము నందె - ఆలి మగనికి అన్యకాంతలపై మనసు తగులుట యోగ్యముకాదు. తుచ్ఛసుఖములు “మీసాలపై తేనియ " లని విరక్తి పుట్టియుండవచ్చును. మఱల ఆ లతాంగి రామణీయకమునకు వశుఁడయి, అప్సరస, అందును నేను వలపింపలేదు, నన్ను వలచినది, అనన్యగృహీత , నే నేల భోగింప రాదు?" అని తన మనమును సమాధాన పెట్టుకొని యుండ వచ్చును. మఱునిముసమునందె “ఇంత కాలము అవిచ్చిన్నముగ నెఱవేర్పఁబడిన నావ్రతమునేల నేఁడు భంగముచేసి కొనవలయును?” అని నిరతము తనమనములో వర్తించి అను