పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అల్లసాని పెద్దన

119


లుండిరని ప్రతీతి కలదు. వీరి సమకాలీనతలో గొంతకాలవిపర్యాసదోష మున్నది. ఒకవేళ ఉండిరనుకొన్నను, వీరిలో నెన్వరి రచనయందు ఆనాఁటి పరస్పర భిన్నాదర్శక సంఘర్షణమును నూతన దృక్పథమును గనఁబడుచున్నది? పెద్దన మనుచరిత్రమునందు. కృష్ణదేవరాయలకు పెద్దనపైఁ బ్రీతిగౌరవములు మిక్కుటము. కావుననే

సీ. “ఎదురైనచోఁ దన మదకరీంద్రము డిగ్గి
            కేలూఁతయొసగి యెక్కించుకొనియె;
     మనుచరిత్రం బందుకొనువేళఁ బురమేఁగఁ
            బల్లకిఁ దన కేలఁ బట్టి యెత్తె ;
     బిరుదైన కవిగండపెండెరమున కివె
            తగుదని నాదు పాదమునఁ దొడగెఁ
     గొకట గ్రామాద్య నేకాగ్రహారము
            లడిగిన సీమల యందునిచ్చె;

గీ. ఆంధ్రకవితా పితామహ యల్లసాని
    పెద్దనకవీంద్ర! యని నన్ను బిలిచె....”

ఇట్టి సత్కారమును గౌరవమును కృష్ణదేవరాయలు మఱే కవికినిఁ జేసియుండలేదు. పెద్దన రాయలకుఁ బియ స్నేహితుఁడు కూడ. రాజు వేఁటకు వెడలునప్పుడు కవీంద్రుని వెంటఁ బెట్టుకొని పోవుచుండెనఁట[1] *కడపజిల్లా



  • </ref>
  • గూడూరులో సబ్‌రిజిస్ట్రారుగా నుండిన నీలం గోవిందరాజులు నాయుడుగారు, బి, ఎ., బద్వేలియందున్నప్పుడు ఆసరస్సును దర్శించిరని నాతోఁజెప్పిరి. వారియొద్ద పెద్దన వంశవృక్షముకూడ కలదు. ఈ నాయుడుగా రిప్పుడు స్వర్గస్థులైరి.