పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

118

కవికోకిల గ్రంథావళి


లురు రాయలకు కప్పములను చెల్లించుచు రాయబారులను పంపుచుండిరి. పోర్చుగీసు సిపాయిలుకూడ కృష్ణదేవరాయల దండయాత్రలందు పాల్గొనుచుండిరి. వ్యాపారము నిమిత్తము వివిధదేశముల ప్రజలు ఆపట్టణమున నివాసమేర్పఱచుకోని సుఖజీవనము సల్పుచుండిరి. చక్కని నీటివసతి యేర్పడుట వలన ఎచ్చట చూచినను పైరుపచ్చలు చెట్టుచేమలు ద్రాక్ష తోఁటలు బలిసియుండినవి. విజయనగరమను మూసయందు వివిధ సంప్రదాయములు, ఆచారములు, నాగరకతలు కరఁగి నూతన నాగరకతగ కరుడు కట్టుచుండినది. కృష్ణదేవరాయల దండయాత్రలలో పాల్గొనని కుటుంబము విజయనగరమున నుండియుండదు. విజయగర్వ మొకవంకయు, విరోధి పట్టణములు కొల్లగొట్టుటవలన ప్రాప్తించిన ద్రవ్య మొకవంకయుఁ బ్రజల ఆత్మగౌరవమునకు సుఖజీవనమునకు సాయపడుచుండినవి. దేశానురాగము స్వభాషానురాగము పొటమరించినది. తెలుఁగు మాటకుఁ జెల్లుఁబడి హెచ్చినది. " దేశభాషలందుఁ దెలుఁగు లెస్స” యను నానుడి పుట్టినది.

ఇట్టి సందర్భములలో సంఘమునందు స్వాతంత్ర్య ప్రీతియుఁ బూర్వాచార వైముఖ్యమును హెచ్చినదనుట యతిశయోక్తిగాదు. ఈమార్పు ఆనాఁటి సారస్వతము నందును గోచరించవలయును. రాయల యూస్థానమునందు అల్లసాని పెద్దన, నంది తిమ్మన, అయ్య రాజు రామభదుఁడు, పింగళి సూరన, ధూర్జటి, మాదన, రామరాజ భూషణుఁడు, తెనాలి రామలింగన్న అను అష్టదిగ్గజము