పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అల్లసాని పెద్దన

117


దూగుచు నడిమింటి సూర్యునివలెఁ బ్రకాశింపఁజొచ్చెను. తెలుఁగు శౌర్యము, తెలుఁగుకీర్తి నల్గడలఁ బ్రసరించెను. ఆకాలమునందు ఆంధ్ర సారస్వతమును కళలును విశేషముగ వృద్ధిచెందినవి. “గులాబిపూవు లంతటను అమ్మబడుచున్నవి. ఆప్రజలు గులాబిపూలను ఆహారముకంటె ఆవశ్యకములయినవిగా భావించుచుండిరి. " ఇక విజయనగర ప్రజల నాగరకతయు సౌందర్య ప్రీతియు భోగలాలసత్వమును వేఱుగఁ జెప్పవలయునా?

పరస్పర భిన్న ప్రకృతులుగల రెండు నాగరకతలకు సంబంధము గలిగినప్పుడు రెంటి యందును గొంత మార్పు గలుగును. బలిష్టమగు నాగరకత దుర్బలమగుదానిని మింగ్రివైచి, తనయందు జీర్ణించుకొనును. అట్లుకాక రెండును తుల్యబలయుతము లయ్యెనేని ఇచ్చిపుచ్చుకొనుటలు, అనుకరణములు, ఆత్మీకరణములు జరుగుచుండును. భిన్న నాగరకతల సంఘర్షణము అభివృద్ధికి అత్యంతావశ్యకము. ఈ కాలమున ఆంధ్రదేశమునందు హిందూ మహమ్మదీయ నాగరకతలకుఁ గొంత సంబంధమును స్పర్దయుఁ గలిగినది, “ ప్రాత యొక రోత, క్రొత్తయొక వింత" యనునట్లు మొగలాయీల భోగ ప్రియత్వము విజయనగర ప్రజలకు వచ్చినది. మహమ్మదీయ స్త్రీల రవికెలు పావడలు ఆంధ్రకాంతల మనముల నాకర్షించినవి.

విజయనగరము సుమారు నూటనలుబది చదరపు మయిళ్ళ వైశాల్యముగల గొప్ప పట్టణము. ఆంధ్ర సామ్రాజ్యమునకు రాజధాని. సింహళమునుండికూడ సామంత నృపా