పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అల్లసాని పెద్దన :

సమకాలీన భావ ప్రతినిధి

సమకాలీన భావములు సాంఘిక పరిస్థితులు కావ్య దర్పణముసందుఁ ప్రతిఫలించుచుండును. కవి స్వతంత్రుఁడయి పూర్వాచార బద్దుఁడు కాకపోయినయెడల రచనాపద్దతి యందును కావ్యవస్తు నిర్ణయమునందును భావ ప్రకటనము నందును దన కాలమునందు వ్యాప్తిలోనుండు పద్ధతులను గ్రహించును; లేక క్రొత్తభంగుల నావిష్కరించును. లక్షణములు ప్రతిభావంతులైన కవులరచనల పరిశీలనము వలఁ దేలిన సామాన్యధర్మములే కావున, అట్టి కవులను అన్యలక్షణములు బంధింప లేవు ఒక్కొక్కప్పుడు వారిరచనలు పూర్వ సంప్రదాయములకన్న బిన్నములుగనుండి మార్గదర్శకము లగును. ఒక్కొక్క. కాలమునకు ఒక్కొక్క సంప్రదాయము రూఢియై యుండును. ఒక కాలముయొక్క సృజనశక్తి తగ్గిన యనంతరము సంప్రదాయము కరుడుకట్టును.

శాస్త్రముకాని శిల్పముకాని ఏకాలమందైనను అప్పటికన్న నభివృద్ధిచెందుటకు వీలులేనంత పరిపూర్ణత చెంది యుండదు. నిర్దోషతయును బరిపూర్ణతయును ఈ లోకమునకు సంబంధించిన గుణములు గావు. కవి కేవలము క్రొత్త పద్దతులను గనిపెట్టవలయునను దీక్షతో పద్మాసనము వేసి కొని కూర్చుండఁడు. ప్రాచీన సంప్రదాయములు నిస్సారము