పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/119

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నాటక కళా సంస్కరణము

113


ద్రవ్యముపోను లాభము మిగులదు.” నాటకరంగమున యాదార్ధ్యభ్రమకల్పించుట కెంత ద్రవ్యమైనను యూరపియను నాటకసమాజములవారు ఖర్చు పెట్టుదురఁట! అంత ద్రవ్యమును మనము వెచ్చింపలేకపోయినను వెచ్చించు ద్రవ్యమైనను ఇచితముగ వినియోగించు టావశ్యకము.

ప్రేక్షక మండలి

ప్రేక్షకమండలిలో అన్నివిధములైన శిక్షణముగల మనుష్యులుందురు. బహి ర్వేషములను చూచి “వీరు నిక్కువమైన కళాభిరుచిగలవా"రని యూహించుట యసాధ్యము. నేనట్లూహించి చాలమాఱులు పొరపడితిని. ప్రేక్షకునికొక దుర భ్యాసముగలదు. అది దురభ్యాసమే కాదు, దురభి రుచియు. ఒక నటకుఁడు శ్రావ్యముగఁ బద్యమునో పాటనో పాడిన వెంటనే (Once more, once more) అని కేకలువేసి చప్పటులు తట్టును. హల్వా తీపుగానున్నదని అజీర్ల వ్యాధి పుట్టువఱకుఁ దినవలయునని వీరిమతము కాబోలు! ముక్కు ఒక వేళ అందముగా నున్నదని మఱిరెండుముక్కులు చేయించుకొని చెంపలకతికించుకొనుటకు వీరిష్టపడుదురా? పునరుక్తి యితర శిల్పములం దెంతదోషమో అంతకన్న నాటకకళ యందును మహాపాతకము. శ్రుతిచాపల్యముచేత నొకపద్యమునకుఁ జెప్పఁబడిన Once more ను మన్నించెదమను కొన్నను సీనునకంతయు Once more చెప్పు ప్రేక్షకుల యభిరుచి మన్నించుటకు వీలుకానిది. అల్లూరు నాటకసమాజము వారు రామదాసు నాటకమును నాగరకులకు ఆకరమైన