పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/118

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

112

కవికోకిల గ్రంథావళి

పౌరాణిక నాటకముల పర్దాలకు సీనులకు రామాయణ మహాభారతములందుఁ గానవచ్చు రాజప్రాసాదాది శిల్ప వర్ణనముల నాదర్శకముగఁ గొనవచ్చును. చారిత్రక నాటకములకు బౌద్ద మొగలాయి శిల్పములను గ్రహింప వచ్చును. వర్తమాన స్థితిగతులఁ దెలుపు సాంఘిక నాటకములకు నేఁటికాలపు సంకరశిల్పముపయోగపడును. ఏ దియెట్లున్నను, ప్రస్తుతము నాట్యరంగము ఆపాదమస్తకము మార్పు నొందవలయును.

ఏ నాటకి సమాజమువారైనను పదునైదు నాటకములను అవకతవకగ నాడుటకంటె నొకటిరెండు నాటకములనై నను సరియైన యుపకరణములతో య్యోముగఁ బ్రదర్శించినయెడల అదియే యశస్కరము. సంఖ్యకన్నను రాశికన్నను, గుణమే ప్రధానము. ఇంగ్లండులో అయిదాఱు సంవత్సరములు విద్యనభ్యసించి మరల హిందూదేశము చేరిన నామిత్రుని అచ్చటి నాటక విషయములను గుఱించి ప్రశ్నింపఁగా ఆయన యిట్లు చెప్పెను: “నేనొక నాటకము ఆఱునెలలకుఁ బూర్వమునుండియు ప్రదర్శింపఁబడుచున్నదని విని యొక నాఁటిరాత్రి చూడఁబోయితిని. అప్పటికిని ప్రేక్షకులు క్రిక్కిరిసియుండిరి. నాప్రక్కను గూర్చుండియున్న యొక పెద్దమనిషిని విచారింపఁగా ఆయన ఇట్లు చెప్పెను— 'ఇంక ఆఱునెలలవఱకు నాడినఁగాని చూడదలఁచుకొన్న వా రందఱును చూడలేరు, ప్రతిదినమును క్రొత్తప్రజలే వచ్చుచుందురు,' కంపెనీవారు ఈనాటకమును సంవత్సరముపాటు ఆడనిదే పర్దాలు మున్నగువానికై వారు వెచ్చించిన పెట్టుబడి