పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాటక కళా సంస్కరణము

111


కన్యాశుల్కములోని గిరీశమును రాజంతఃపురములో సంచరించు చున్నటుల చూపింతుము. పిడుగునకు బియ్యమునకు ఒకే మంత్రము వేయుటవలన అట్టి వైరుధ్యము సంభవించు చున్నది. పౌరాణిక నాటకములాడినను లేక చారిత్రక సాంఘిక నాటకము లాడినను మొదటిపర్దా, వీధి, అంతఃపురము, దర్బారు, అడవి అను నీ అయిదు వర్గాలనే యుపయోగింతురు; ఒకనాటకములోని నాయకుఁడును ప్రతినాయకుఁడును ఒకే యంతఃపురములోనో, లేక యొ కేదర్బారులోనో మార్చి మార్చి కనఁబడుచుందురు. నేఁడు నాటకశాలలో అగపడుచున్న పర్దాలు సీనులును ఇరువదియవశతాబ్దపు సంకర శిల్పముయొక్క ప్రతికృతులు,

ఇట్టివైరుద్ధ్యము సంభవింపకుండుటకుఁ గొన్ని ప్రయత్నములు చేయవచ్చును, నాటకములను బౌ రాణికములనియుఁ జాంత్రకములనియు సాంఘికములనియు విభజించి ఒక్కొక నాటక సమాజము వారు ఒక్కొక వర్గమునకు సంబంధించిన నాటకములకుఁదగిన యుపకరణముల నేర్పఱచు కొని నాట్యకళ యందుత్తమ సిద్ధిని పొందవచ్చును. అట్లుగాక సమాజము భాగ్యవంతమైనయెడల ఆమూడువిధములైన నాటకములకు ఆయా దేశ కాలపరిస్థితులకు సంబంధించిన పర్దాలును ఇతరోపకరణములను సేకరించి తరువాత అట్టి నాటకములఁ బ్రదర్శింపవలయును, కాని, యిట్టి ప్రయత్న ములు జమీందారుల పోషణమున నభినృద్ధియగుచుండు మైలవరం సమాజము, ఏలూరు సమాజము మున్నగువాని కే యొక వేళ సాధ్యము.