పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

110

కవికోకిల గ్రంథావళి


వడఁకురోగముపుట్టి కాలుసేతు లతితీవ్రముగ వడఁకింతురు. ఈయసామాన్యమైన యభినయ కౌశలము చూచినంతనె కొందఱు ప్రేక్షకులు పొట్టలుపిసుకుకొని నవ్యుదురు. ఈ మెచ్చుకోలుచేఁ బ్రోత్సహింపబడి చండామార్కులు మఱికొంత తీవ్రముగ వడఁకుదురు పాపము ! వారి నిస్సహాయతకుఁ బేక్షకుల మనస్సులో కవి కరుణరస ముప్పతిల్ల జేయ వలయునని తలంచెనుగాని, సటకుఁడందుకు భిన్నమైన హాస్యరసమును బుట్టించెను, ఇతరులను నివ్వించుటకు నాట్యకళా కౌశలము అవసరము లేదు. చీలమండలవఱకు గుడ్డ కట్టుకొని యుండినయొకఁడు స్టేజిపైకివచ్చి మోకాళ్ళ, వఱకు గుడ్డ నెగఁదీసికొన్న యెడల ఆవై చిత్ర్యమునకుఁ జాల మంది నవ్యుదురు.

నటకులు కవులవలెనె వారి వారి శిల్పనైపుణ్యము చేత లోకము నుద్దరింపఁ దగినవారు. వారిబాధ్యతయుఁ గొంచెముకాదు. కావున ప్రజాసామాన్యము యొక్క యభిరుచికి వారు తమ శిల్పమును దింపుటకంటెఁ బ్రజల యభిరుచిని గ్రమక్రమముగ సంస్కరించుటకుఁ బ్రయత్నము సల్పవలయును.

నాటకశాల

నాట్యరంగ మెప్పటికిని యాదార్ధ్యభ్రమను గొల్పవలయును కాని, మన ముపయోగించు నర్దాలకును, మనము ప్రదర్శించు నాటకములకును దేశకాలపరిస్థితి వైరుద్ద్యము: కనుపట్టుచున్నది. సారంగధరునో లేక కృష్ణార్జునులనో మద్రాసు మౌంటురోడ్డులో తిరుగుచున్నటుల ప్రదర్శింతుము.