పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాటక కళా సంస్కరణము

109


దురు, పాపము! రామదాసునకు ఉర్దూభాష శ్రుతపాండిత్యమే కావున చెప్పినమాటల నెటులో అర్థము చేసుకొనునే కాని, ఉర్దూభాషలో తిరిగి జవాబు చెప్పు భాషాజ్ఞానము లేక "తెలుఁగుతో మాటలాడును. తెలుఁగువారు ఉర్దూభాష చక్కగా నేర్చుకొనునంతవఱకైన నటకులిట్టి చాపల్యము వంకకుఁ బోకుందురని నా ప్రార్ధనము,

మహమ్మదీయ పాత్రోచితమైన భాష నుపయోగింప నిష్టమైనయెడల మహామహోపాధ్యాయ వేదము వేంకటరాయ శాస్త్రులవారు ప్రతాపరుద్రీయమున వలీఖాను ప్రభృతులకును బొబ్బిలియుద్ద నాటకమున హైదరుజంగు మున్నగు వారికి నుపయోగించిన మిశ్రభాష రమ్యముగ నుండును; కాని, పఠాను మొట్టమొదటి ప్రవేశమున స్వచ్చమైన యుర్దూ భాషయును కడపటిసీనులలో అందుకు విరుద్ధముగ సంస్కృతపద భూయిష్టమైన సమాసములను మాటలాడుట విపరీతముగ దోఁచును.

ఒక్కొక్కప్పుడు నటకులు సామాన్య ప్రేక్షకులను నవ్వించి చప్పటలు కొట్టించుటకు, అవసరమైన యభినయము చూపి కవి యుద్దేశించిన రసమునకు విరుద్ధమైన రసము నుప్పతిల్లఁ జేయుదురు. ఒక్క యుదాహరణము : హిరణ్యకశిపుని యొద్దకు చండామార్కులు విద్యాపారంగతుఁడైన ప్రహ్లాదుని దీసికొనివచ్చి పరీక్ష, చేయుఁడని చెప్పుదురు. రాజు పరీక్ష చేయును. ప్రహ్లాదుఁడు విష్ణువునేస్మరించును. హిరణ్యకశిపుఁడు కోపగించుకొని గురుపుత్రులతట్టు చూచును. అంతట వారికి