పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/114

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

108

కవికోకిల గ్రంథావళి


నాఁటి | ఫ్రెంచి విగ్గులను ధరించుకొని సర్వకాల సర్వావస్థల యందుఁ దలలు విరియబోసికొని తిరుగు చుందురు.

కవికల్పనమును దమయిష్టమువచ్చిన రీతిని కత్తిరించు అలవాటు నటకులకు మిక్కుటముగ నున్నది. కవి నటకుల కన్నఁ దక్కువ ప్రతిభగలవాఁడయినప్పుడును, కథ కొంచెము దీర్ఘమైనప్పుడును నాటకమిట్టి శస్త్రచికిత్సకుఁ బాల్పడుచున్నది. కాని యిట్టి కత్తిరింపు జరిగిన వెనుక నాటక మెట్లు స్వరూపలోపమును బొందకయుండునో, సంయోగత చెడిన ఆ నాటకమును సహృదయరంజకముగ నటకు లెట్లు ప్రదర్శింపగలరో తోఁపకున్నది. వీనినన్నిటిని దృణప్రాయ మొనరించు సాహసము మఱియొకటి కలదు, తెలుఁగు నాటకములలో భిన్నమగు మరియొక భాషను జొప్పించుట ! ఇది కవి యొనరించిన పాపము కాదు. నటకులు Stage effect కొఱకు (అందేమి Stage effect ఉన్నదో గోచరించుట లేదు. Effect కు మాఱు defect కనబడుచున్నది.) స్వచ్ఛమైన యుర్దూ భాషను ఎవరిచేతనైన వ్రాయించుకొని గుడ్డిపాఠము జేసి సభాస్తారులపైఁ గసిదీర్చుకొందురు. సుప్రసిద్ధనటకులని పేరు వహించినవారు కూడ సామాన్య ప్రజల కన్నులలో దుమ్ము కొట్టుటకు వీలయిన యీ యథమమార్గము నవలంబించు చుండిరన్న , ఇఁక ఈ రంగసంప్రదాయముల పయిని మమతపోవని నటకు లుండుట యరుదు. పఠానువేషము దరించిన . రాఘవాచార్యులవారి పద్ధతి నవలంబించియే కాబోలు పర్వతరెడ్డి రామచంద్రారెడ్డిగారు కబీరుపాత్రమును ధరించి రామదాసుతో ఉర్దూభాషలో మాటలాడు