పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/113

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నాటక కళా సంస్కరణము

107


Tragic element ను లేని నటకుఁడు పాత్రమును స్వభావ సిద్ధముగ అభినయింప లేఁడు. .

భూమికా ధారణమును గురించి యించుక వ్రాయవలసియున్నది. పాత్రోచితగౌరవమును బోషించునది వేషము. వేషమునుబట్టి సాధారణముగ మన మొక మనుష్యుని స్వభావశీలాదులను, అభిరుచిని, శిక్షణము మున్నగు వానిని గురించి కొంచె మెచ్చుతక్కువగఁ దెలిసికొనఁగలము కాని చాలమంది నటకులు పాత్రోచిత వేషములు ధరించుట లేదు. సావిత్రి, సీత, దమయంతి మున్నగు పౌరాణిక నాయకులు మోచేతుల కిందికి జాఱుచుండు జాకెట్టులు, ఎఱ్ఱని పట్టుతోఁ జేయబడిన "బో" అమర్చబడియున్న టోపా, ఉల్లిపొరలవంటి సిల్కులు ధరించుచుందురు. వారి వేషములను జూచినప్పుడు గౌరవమునకు మాఱు లాఘవము మన మనస్సులలో నుత్పత్తియగును. వారి కులుకు బెళుకులు మూతి త్రిప్పుటలు మున్నగు పోకు లక్షణములు బజారీజంతలకుఁగూడ సిగ్గు పుట్టించును. చేటికలు నాయికల తల దన్నునట్లు అలంకరించుకొందురు. వారిలో నాయిక యెవతయో చేటిక యెవతయో గుర్తించుటకుఁ గొంత సంభాషణము జరిగినఁగాని సాధ్యముగాదు. హిరణ్య కశిపుఁడు మున్నగు రాక్షసనాయకులు పదియాఱవశతాబ్దమున రోమను వీరులు ధరించు ఉడుపులను వేసికొందురు. ఆ యుడుపులలోని చీలికలకు, కత్తిరింపులకు ఏలాటి యర్థముండదు. ఇతర రాజపాత్రలు పదునెనిమిదవ శతాబ్దము