పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/112

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

106

కవికోకిల గ్రంథావళి


తోడ, కవిగారు తనభావములను వారి మనస్సులోనికి బిచికారి చేయును.

“భామవేషగాడికి మఱింత నెయ్యి పొయ్యండి. తిత్తి వూదేవాఁడికి పప్పుకూడా కావాల్నా” అను ప్రాఁత భాగవతుల పాత్రగౌరవములు ఇప్పటి నాటకసమాజములలో గూఁడఁ బొడకట్టుచున్నవి. ఏ నాటకమందైనను, ఆయాస్థలముల ఆయాపాత్రము ప్రముఖమనియు, ఎంతనీచపాత్రమైనను తన నియోగమును జక్క-గాఁ నిర్వర్తించినయెడలఁ బ్రశంసార్హమనియు, నటకునికివచ్చు పేరుప్రతిష్ఠలు తానుపోషించు పాత్రయొక్క యుదాత్తగుణముల ననుసరించికాక , పాత్రలోచితాభినయ చాతుర్యమువలన ననియు, నటకు లెఱుంగరు. ఒకవేళ యెఱింగియుఁ జాపల్యమును జిక్కఁబట్ట లేనున్నారు. ప్రతినటకునకును దాను నాయక పాత్రమును ధరించిననేగాని సుప్రసిద్ధుఁడు గానేరఁడను అపోహ గలదు. ఇట్టి దురభిప్రాయము చేతనే చిల్లర పాత్రములను అభినయించిన కొందఱు తయ పాఠములను జదువక ఉదాసీనులయి నాటకము యొక్క సమష్టిరంజకత్వమునకు లోపమువాటిల్లఁ జేయుదురు. ఒక్కొక్కప్పుడు చెడగొట్టుదురు.

తాను ధరింపబోవు పాత్రముయొక్క గుణపోషణమునకు, స్వభావమునకు తన మనస్తత్వము సరిపోవునా లేదా యను విచారము నటకుని కుండవలయును. మొట్టమొదట తాను తన మనస్సును స్వభావమును పృథక్కరించుకొనుట యావశ్యకము. తన స్వభావమునందు గాంభీర్యమును