పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాటక కళా సంస్కరణము

103


సహానుభూతి యుండదు. నటకుఁ డెప్పుడును పాఠ మందిచ్చు వావి పై (Prompter) ఆధారపడియుండఁగూడదు.

నాటకమునకు అభినయము (చేష్ట) ప్రధానము. కార్య ప్రచలనము లేనియెడల నాటక మనిపించుకొనక యొక యుపన్యాసమగును.[1] *కార్యప్రచలనమును, అభినయమును అడ్డగించుపాటలను పద్యములను నటకు లంగీకరింపరాదు. కాని పాట పద్యములపైని చాపల్యముచేత కవి యుద్దేశింపని చోటులలోఁగూడఁ గ్రొత్తక్రొత్త పద్యములను బాటలను జేర్చి కార్యగతికి భంగము గలిగించుకొందురు, ఏల? అభినయలోపమును సంగీతముచేఁ బూరించుకొనుటకు ఒక దాని యందలి లోపమును భిన్నమగుమఱియొక దానితో బ్రయత్నించుట [2]+చింతకాయ బహుమానమువలె నున్నది.


+

  1. ఇది నాటకరచనకు సంబంధించిన విషయము, “ఇందుకు నటకులు బాధ్యులుకారు. నాటకలక్షణమునకు సరిపోవునదియు తమ ప్రతి.భను జక్కగఁ బ్రకటించుకొసుటకు అనువైన పాత్రపోషణము కలదియునగు నాటకమును నటకులు ప్రదర్శనమున కేర్పఱచుకొనవలయును. కాని యిప్పటినటకులపద్దతి వేఱుగ నున్నది. ఏ నాటకములోఁ బాటలు పద్యములు మెండుగనుండునో అదియే యుత్తమనాటకమని వారి యభిప్రాయము; అట్టినాటకములవలన నటకులకు వచ్పుకీర్తి నాట్యపరమైనది కాదు, గానపరమైనది
  2. ఒకరాజునకు ఒకరైతు నిమ్మపండును దెచ్చి బహుమతిచేసెను. దానిని జూచుచుండిన మఱియొకఁడు పొడవాటి చింతాకాయను దెచ్చి రాజునకు సమర్పించెను , రాజు చిఱునవ్వుతో "ఇదియేమి బహుమాన ?" మని ప్రశ్నించెను. అందున కాతఁ డిట్లు జవాబు చెప్పెను, “లావువాసి పొడుగులో నున్నది. పులుసునకు. దానమ్మా మొగుడు,”