పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

102

కవికోకిల గ్రంథావళి


గారు రచియించిన నాటకగీతావిశ్వకోశమువంటిది వారికిఁ గూడ నొకటి యుండినది. ఇదివరకు రచియింపఁబడినవి, యిపుడు రచియింపఁబడునవి, యిఁకమీఁద రచియింపఁబడఁబోవు సర్వనాటకములకును అందు పాటలు గలవు, రేపటి రాత్రి నాటకము వేయవలయునని యనుకొన్నయెడల, ఈ నాఁటి ప్రొద్దున నాటక పాత్రములును, సీనులను వారే తీర్మానించుకొని సందర్భానుసారముగ పాటలు చొప్పించి స్వంత కవిత్వముతో నాటకమును తుదముట్ట ఆడివేయుదురు. ఇట్టి దురవస్థనుండి నాటకములను రక్షించినందులకు నేఁటికాలపు శిక్షిత నాటకసమాజములవారు ప్రశంసాపాత్రులు!

పూర్వపునటకులకన్న నేఁటికాలపునటకులకు బాధ్యత యెక్కువ ; ఏలయన -- ఇప్పటినటకులు విద్యావంతులు, నాగరకులు, ప్రేక్షకులుకూడ నట్టివారే. కావున నటకులు నిర్బాధ్యముగఁ బ్రవర్తించుటకు వీలు లేదు. వారు గమనింపవలసిన విషయములు చాల గలవు. కాని, వ్యాసవిస్తర భీతిచే నిచ్చట కొన్నిటినిమాత్రము వ్రాయుచున్నాను.

తాను ధరింపఁబోవు పాత్రమును, కవి పోషించిన విధమును, ఆపాత్రయొక్క గుణగణములను, మనస్తత్వమును నాటక బంధమునందు ఆ పాత్రమునకుఁగల స్థానమును ప్రయోజనమును, తన కార్యప్రవృత్తికి హేతువైన భావమును నటకుఁడు మొట్టమొదట గుర్తెఱుఁగవలయును. వారు మాటాడు ప్రతిమాటకును అర్థము చక్కఁగఁ దెలిసియుండవలయును. అర్థము తెలియనిదే భావోదయముగాదు; భావోదయము కానిదే తాను అభినయించు పాత్రము యొక్క యవస్థయందు