పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/107

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నాటక కళా సంస్కరణము

101


అంతమాత్రము గాటులేనిదే ప్రజలకు రుచింపదు, పాపము ! కవియేమిచేయును? శతావధానులు పిశుపాటి చిదంబరశాస్త్రులుగారు, గయోపాఖ్యానమును జూచి దానిని మించ వలయునను కోరికతో శ్రీరామాంజనేయమను నాటకమును వ్రాసి శ్రీరామునికిని అంజనేయునకును వైరము గల్పించి యిగువురిసంవాదమును ముదిరిన కొండమిరపకాయ పాకములోనికి దింపినారు. రామకృష్ణాచార్యులవారు ప్రమీలార్జునీయనాటకమును రచించి, నాగరిక విద్యాంసులచే వ్రాయఁబడు నాటకములలో బూతు ఎంతవరకు నొప్పుకొనఁ దగ్గది యనువిషయమును దృష్టాంతపూర్వకముగ దృఢపఱచినారు. వ్రాయుకొలఁది యిట్టి యుదాహరణములకు లెక్క యుండదు. రెండుమూఁడు ఊరక మచ్చుచూపితిని.

నటకులు

కొంచె మించుమించు ఇరువది యిరువదియైదు సంవత్సరములకు , బూర్వము తెలుఁగుదేశమున, నాటకవృత్తి నవలంబించినవారే నాటకము లాడుచుండిరి. (మరల నిప్పుడు కూడ) ఆకాలమున నాటకములన్నను, నటకులన్నను ఒక విధమైన యనుమానము, హైన్యమును దోఁచుచుండెడిది. ఇందుకుఁ గారణము లేకపోలేదు. ఆనటకులలోఁ జాలవఱకు దేశద్రిమ్మరులు, తల్లిదండ్రులను, ' దారపుత్రాదులను వదలినవారుగనో లేక యితరుల సంసారములను జెడఁగొట్టిన వారుగనో యుండిరి. వారు ప్రదర్శించుచుండిన నాటకము లెల్లను వారి సొంతసృష్టులు. ఈ కాలమున పాపట్ల కాంతయ్య