పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/106

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

100

కవికోకిల గ్రంథావళి


వైరుద్ధ్యము గోచరించుచుండును. దాని నొప్పుకొన్నను, ఆ పాత్రముల హైందవపురాణ పరిచితి చూఁడ చిత్రముగ నున్నది. బుస్సీదొర 'స్తంభమునుండి పైకురికి' అను పద్యమును చదువును. పటాను సంస్కృతపద భూయిష్టమైన పొడవగు సమాసములతో సప్తమారుతములను జిల్లర దేవుళ్ళను తన్నుఁ జంపుటకుగా ఆహ్వానించును. హైందవేతర జాతులకు సంబంధించిన యుత్తమ పాత్రములచే నుత్తమభాషను మాట్లాడించుట యొకవిషయము. కాని, వారికి మనశాస్త్ర పురాణములయందుఁ బరిచయము గలిగినట్లు వ్రాయుట వేఱొకవిషయము మహమ్మదీయుల యుత్తమ పాత్రత్వమునకు హైందవ పురాణ పరిచయము ఆవశ్యకముగాదు. దుఃఖము కలిగినప్పుడు తమ తమ మనస్సులలో నెలకొని యున్న దైవమునో దేవతలనో స్మరించుట స్వాభావికముగ నుండునుగాని, అట్టిసమయమున మహమ్మదీయుఁడు పౌరాణిక దేవతలను తెలంచుట విరుద్ధముగఁ గనుపట్టును. బుస్సీదొర బైబిలునుండి యుపమానమును గ్రహించినయెడల నుచితముగ నుండెడిది. పటాను ఖొరానునందో లేక మఱి యేవిధమైన మహమ్మదీయ పురాణమునందో పరిచితమైన దేవతలను ప్రవక్తలను ఆహ్వానించియుండిన మెఱుఁగుగ నుండెడిది.

చిలకమర్తి లక్మీనరసింహంగారు రచియించిన గయోపాఖ్యానమున కృష్ణార్జునుల దెప్పిపొడుపులు, ఆత్మ గౌరవముపై దృష్టిగల యే పెద్దమనుష్యుఁడును మాట్లాడి యుండఁడు. ఇక కృష్ణార్జునుల మాట యేల? సంవాదములలో