పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/105

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నాటక కళా సంస్కరణము

99


అందఱును ఈ క్రింది విధమున జబాబిచ్చుచుందురు: 'రామచంద్రారెడ్డి హిందూస్థాని పాటలను జక్కఁగా పాడఁగలడు. నాటకము ప్రారంభమునుండి తుదివఱకు పాడుచున్నను, కొంచెముగూడ ఆయనగొంతు రాఁపుపుట్టదు. ఆయన పాడుచున్నప్పుడు మఱికొంతసేపు పాడుచుండిన బాగుగానుండునని తోఁచును. నా మట్టుకు నేను రెండుమారులు Once more, అన్నాను.' రామచంద్రారెడ్డిగారిని గుఱించి చెప్పఁబడున దంతయు యధార్థమె. కాని నాటకము ఏ విధముగ మెచ్చుకొనబడవలయును? షేక్‌స్పియరు మహాకవియొక్క ప్రతిభ, గ్యారిక్కు ననుసరించి యుజ్జీవింపవలయునా? లేక యాతని రచనలకు స్వతంత్రమైన యంతస్సారముగలదా? చదువరు లూహింపఁగలరు. బూటకపు టాదారముల నాశ్రయించి ప్రసిద్ధికెక్కిన నాటకములు ఆశ్రయచ్యుతి గలిగిన వెంటనే విస్మృతములగును. ప్రేక్షకుల యభిరుచి ననుసరించి వ్రాయఁబడు నాటకములు వారియభిరుచి మాఱువఱకే గౌరవింపఁబడును. తర్వాత సధఃపతనము,

పాత్రోచితమైన భాషనుపయోగించు టావశ్యకము . మహోపాధ్యాయ, కళాప్రపూర్ణ వేదము వేంకటరాయశాస్త్రులవారు బొబ్బిలినాటకమున బుస్సీ దొర పాత్రమునకు వ్యాకృత భాషనే యుపయోగించిరి. కోలాచలము శ్రీనివాసరావుగారు రామరాజు నాటకమున పటానునకు ఉత్తమభాషనే యుపయోగించిరి. వారిని ఉత్తమ పాత్రలనుగఁ జిత్రించి అట్టిభాష నుపయోగించి యుందురు. కాని, ప్రదర్శనమునందు వారి వేషములకును వారి భాషలకును జాల